హుబ్లీ: చనిపోయాడనుకొని ఆస్పత్రి నుంచి ఊరికి తరలిస్తుండగా మార్గమధ్యంలో బతికిన వ్యక్తి వారం తర్వాత చికిత్స ఫలించక శనివారం మృతి చెందిన ఘటన హావేరి జిల్లా శిగ్గాంవి తాలూకా బంకాపుర గ్రామం వద్ద చోటు చేసుకుంది. బిస్టప్ప అశోక్ గుడిమని(45) మృతుడు. 15 రోజుల క్రితం పచ్చకామర్ల వ్యాధితో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ క్రమంలో చికిత్స చేసిన వైద్యులు వ్యక్తి చనిపోయాడని మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించారు. ఆ మేరకు శవాన్ని తరలిస్తుండగా ఆయన ఎప్పుడూ ఇష్టపడే డాబా వద్ద డాబా వచ్చింది చూడు, భోజనం చేస్తావా అంటూ మృతుడి భార్య మృతదేహాన్ని పట్టుకొని అల్లాడించడంతో ఆ వ్యక్తి కళ్లు తెరిచారు. దీంతో తక్షణమే ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్సకు హుబ్లీ కిమ్స్‌లో చేర్పించారు. అలా ఓ వారం పాటు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అయితే చికిత్స ఫలించక అతడు చనిపోయినట్లు వైద్యులు తెలపడంతో తాజాగా మృతదేహాన్ని బంకాపురకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment