సేవే మార్గం.. సమాజానికి ఆదర్శం
రాయచూరు రూరల్ : నేటి ఆధునిక యుగంలో భిక్షమెత్తి దెప్పిపొడుపు మాటలు పడుతూ సమాజానికి మంచి చేయాలనే తపన, మానవత్వంతో పేదలకు తన వంతు సేవ చేయాలనే తలంపుతో ముందుకు వచ్చిన వారిలో హిజ్రా జమునమ్మ ఒకరు. చదువు సంధ్య లేని ఆమె కొప్పళ జిల్లా కారటిగి తాలూకా బెన్నూరు నివాసి. గత 16 ఏళ్ల నుంచి రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా ముక్కుంద గ్రామంలో నివాసముంటోంది. బాలుడిగా ఉండగా వయస్సు పెరిగే కొద్దీ ఆమెలో బాలిక లక్షణాలు గోచరించాయి. జమునమ్మకు 53 ఏళ్లు నిండాయి. ట్రాన్స్‌జెండర్(హిజ్రా)గా మారిన జమునమ్మ పేదవిద్యార్థినులను బీఏ, బీకాం వరకు చదివించింది. మధుశ్రీ అనే మహిళను పోలీస్ శాఖలో ఉద్యోగం లభింపచేసింది. భిక్షమెత్తిన డబ్బుల్లో 75 శాతం సొమ్మును సమాజ సేవకు, 25 శాతం సొమ్మును స్వంత ఖర్చులకు వినియోగిస్తోంది. సమాజంలో అన్ని చోట్ల అవమానాలు భరించి దశాబ్ద కాలం నుంచి 25 మంది పేదలకు పెళ్లిళ్లు చేశారు. ట్రాన్స్‌జెండర్ జమునమ్మ అక్షరదాత, మార్గదర్శకురాలిగా వ్యవహరిస్తున్నారు. సమాజ సేవకు అంకితమైన జమునమ్మను కాయకరత్న అవార్డు, బసవ శ్రీ అవార్డు, ఇతర సమాజ సేవ అవార్డులు వరించాయి. సింధనూరు తాలూకా హొసళ్లి క్యాంప్ దుర్గా పరమేశ్వరి ఆలయంలో ఐదు మంది పేద జంటలకు పెళ్లిళ్లు జరిపించింది. విద్యార్థుల అనుకూలం కోసం పాఠ్య పుస్తకాలు, బెంచీలు, టేబుళ్లు, కుర్చీలు అందించింది. తాను పెళ్లి చేసుకోకుండా తన సొంత డబ్బులతో తన వంతుగా పేద పిల్లలకు పెళ్లిళ్లు చేయించినట్లు తెలిపింది.
పేద విద్యార్థులకు బాసట జమునమ్మ
భిక్షమెత్తి వివాహాలు జరిపించిన వైనం
సేవే మార్గం.. సమాజానికి ఆదర్శం
Comments
Please login to add a commentAdd a comment