ఘనంగా సేవాలాల్ జయంతి
రాయచూరు రూరల్: నగరంలో సంత్ సేవాలాల్ జయంతిని శనివారం ఆచరించారు. బసవేశ్వర సర్కిల్‌లో సంత్ సేవాలాల్ చిత్ర పటాన్ని ఊరేగించారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ సేవాలాల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ జ్యోతి వెలిగించారు. కార్యక్రమంలో నగరసభ కమిషనర్ గురుసిద్దయ్య, శ్రీదేవి నాయక్, దీపా నాయక్, రాజు, జ్యోతి బాయి, లచ్చప్ప, వెంకటేష్, ఈరణ్ణ, శశికళ, తహసీల్దార్ సురేష్‌వర్మలున్నారు.
హొసపేటెలో..
హొసపేటె: టీబీ డ్యాం పీఎల్‌సీ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సేవాలాల్ మహారాజ్ జయంతిని శనివారం నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరెడ్డి కార్యక్రమంలో పాల్గొని సేవాలాల్ చిత్రపటానికి పూజలు చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నిర్మల, ఈరప్ప, మంజుల, శారద, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా సేవాలాల్ జయంతి
బళ్లారిటౌన్: జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, కన్నడ సంస్కృతి శాఖ, మహానగర పాలికెల ఆధ్వర్యంలో శనివారం జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో సంత సేవాలాల్ జయంతిని ఘనంగా జరిపారు. పలువురు ప్రముఖులు మాట్లాడుతూ సేవాలాల్ తమ తత్వాల ద్వారా లోకజ్ఞానం, ముక్తిమార్గం చూపారని గుర్తు చేశారు. అంతకు ముందు మున్సిపల్ కళాశాల ఆవరణ నుంచి సంత సేవాలాల్ చిత్రపటానికి పుష్పార్చన చేసి ఊరేగించారు. కన్నడ సంస్కృతిక శాఖ ఏడీ నాగరాజు, శివమొగ్గ జిల్లా ప్రొఫెసర్ నాగేంద్ర నాయక్, సేవాలాల్ బంజార సంఘం అధ్యక్షుడు రాజు నాయక్ పాల్గొన్నారు.
ఘనంగా సేవాలాల్ జయంతి
ఘనంగా సేవాలాల్ జయంతి
Comments
Please login to add a commentAdd a comment