బంజారా సముదాయ అభివృద్ధికి చర్యలు
బళ్లారి రూరల్ : బంజారా సముదాయ అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హెచ్‌సీ.మహదేవప్ప తెలిపారు. దావణగెరె జిల్లా పరిపాలన, సాంఘిక సంక్షేమశాఖ, తాండా అభివృద్ధి మండలి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం దావణగెరె జిల్లా న్యామతి తాలూకా సూరగొండనకొప్పలో ఏర్పాటు చేసిన సంత సేవాలాల్ 286వ జయంతిని ఆయన ప్రారంభించి మాట్లాడారు. బంజారా సముదాయ ప్రజలు కష్టజీవులన్నారు. పనుల కోసం, ఉపాధి కోసం వలసలు వెళ్లేవారు అధికం. అందుకోసం వారి పిల్లల చదువులకు దూరమయ్యేవారు. ఈ నేపథ్యంలో సూరగొండనకొప్పలో 1 నుంచి పీయూసీ వరకు వసతి పాఠశాలను ప్రారంభించినట్లు తెలిపారు. 2025–26వ ఏడాదికి బడ్జెట్‌లో ఆమోదం పొందినట్లు తెలిపారు. ఇందుకోసం రూ.40 కోట్ల నిధులు వెచ్చించినట్లు తెలిపారు. సంత సేవాలాల్ నీతిమంతుడు, తత్వసిద్ధాంతాలను ప్రతిపాదించారన్నారు. సంత సేవాలాల్ ఆరాధన కోసం రాష్ట్రంలో 1500 బంజారా భవనాలను నిర్మాణం జరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బంజారా సముదాయ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. హొన్నాళి ఎమ్మెల్యే డీజీ శాంతనగౌడ, మహారాష్ట్ర ప్రభుత్వ భూజల సంరక్షణ శాఖ మంత్రి సంజయ్ డి.రాథోడ్, ఎమ్మెల్యేలు బి.వై.విజయేంద్ర, డాక్టర్ చంద్రు కె.లమాణి, కౌశల్యాభివృద్ధి నిగమ అధ్యక్షుడు శాంతానాయక్, మాజీ ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్య, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 1500 బంజాన భవన
నిర్మాణానికి ఏర్పాట్లు
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హెచ్‌సీ.మహదేవప్ప
Comments
Please login to add a commentAdd a comment