జిల్లా కోర్టు తాత్కాలిక భవనం పరిశీలన
హొసపేటె: విజయనగర జిల్లా నూతన జిల్లా కోర్టు కోసం తాత్కాలికంగా ఇచ్చిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని జిల్లా స్థాయి జడ్జితో కలిసి ఎమ్మెల్యే హెచ్‌ఆర్ గవియప్ప పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాలూకా కార్యాలయ పాత భవనాన్ని ప్రస్తుతానికి జిల్లా కోర్టుకు ఇచ్చామన్నారు. జిల్లాధికారి కార్యాలయం సమీపంలో కోర్టు కాంప్లెక్స్ నిర్మించే వరకు ఇక్కడే కోర్టు కార్యకలాపాలు ప్రారంభిస్తారన్నారు. జిల్లా కోర్టు భవనంతో పాటు జిల్లా పాలనా సముదాయ భవన నిర్మాణానికి తక్షణమే రూ.200 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మంజునాథ స్వామి, కోశాధికారి మారియప్ప, న్యాయవాదులు ఏ.కరుణానిధి, కేటు జంబయ్య, గుజ్జల నాగరాజ్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
సమాచార శాఖ కార్యాలయ భవనం కూడా..
నిలిచి పోయిన వార్త, ప్రజా సంబంధాల శాఖ అధికారి కార్యాలయ నూతన భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కేఆర్‌డీఎల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశిస్తామని విజయనగర ఎమ్మెల్యే హెచ్‌ఆర్ గవియప్ప తెలిపారు. ప్రధాన రహదారికి అనుసంధానంగా ఉన్న పటేల్ నగర్‌లో నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణ పనులను శనివారం ఆయన పరిశీలించి మాట్లాడారు. విజయనగర జిల్లా కావడంతో జిల్లా స్థాయి కార్యాలయాలన్ని పూర్తి స్థాయిలో పని చేయాలంటే సొంత భవనం తప్పనిసరి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment