ఖజానా ఖాళీనా.. మరి ఖర్చులు ఎలా?
రాయచూరు రూరల్: రాయచూరు సిటీ కార్పొరేషన్ ఖజానా ఖాళీనా? అయితే ఖర్చులు ఎలా భరిస్తారని నగరసభ సభ్యుడు జయన్న ప్రశ్నించారు. శనివారం సిటీ కార్పొరేషన్ భవనంలో మేయర్ నరసమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బడ్జెట్ ముందస్తు సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశుధ్యం, మురుగు కాలువలు శుభ్రం చేయడానికి నెలవారి జీతాలు ఎలా చెల్లిస్తారని నిలదీశారు. అధికారులుచెప్పడాన్ని బట్టి చూస్తే బడ్జెట్ కేవలం రూ.30 లక్షలు ఉందని అన్నారు. ప్రస్తుతమున్న సిబ్బందికి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వివిధ పద్దుల కింద కాంట్రాక్టర్లకు రూ.15 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌లో ఉంచడాన్ని తప్పుబట్టారు. తాగునీటి ఎద్దడి నెలకొనకుండా చర్యలు చేపట్టాలన్నారు. దశాబ్దం గడిచినా నగరసభ పరిధిలోని దుకాణాలకు టెండర్లు పిలువకుండా కాలయాపన చేయడం తగదన్నారు. సభ్యుల పదవీ కాలం ముగుస్తున్నా మౌనం వహించడం సరికాదన్నారు. సమావేశంలో ఉప మేయర్ సాజిద్ సమీర్, కమిషనర్ గురుసిద్దయ్య, సభ్యులు పవన్, రత్న, ప్రశాంతి. లక్ష్మి, సరోజమ్మ, జిందప్ప, నాగరాజ్‌లున్నారు.
నగరసభ సభ్యుడు జయన్న సూటిప్రశ్న
Comments
Please login to add a commentAdd a comment