వక్ఫ్ బిల్లును విరమించుకోవాలి
రాయచూరు రూరల్ : లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రవేశ పెట్టిన వక్ఫ్ బిల్లును విరమించుకోవాలంటూ ఎస్‌డీపీఐ డిమాండ్ చేసింది. శనివారం ముదుగల్ అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు ఫారూక్ బేగ్ మాట్లాడారు. 2024లో వక్ఫ్ చట్టం అమలు పరిచే విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మైనార్టీ యువకుల్లో హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలకు తావు ఇచ్చినట్లు అవుతుందన్నారు. ఈ చట్టం వల్ల హిందువుల ఆస్తులను కొల్లగొట్టడానికి వక్ఫ్ బిల్లు ద్వారా కుట్రలు పన్నుతున్నారని, ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment