మైసూరు: హత్య కేసును మూసివేసేందుకు రూ.80 వేల లంచం తీసుకుంటుండగా ఓ ఎస్‌ఐ లోకాయుక్త వలలో చిక్కిన ఘటన జిల్లాలోని పిరియాపట్టణ తాలూకాలోని బెట్టదపురలో జరిగింది. వివరాలు.. బెట్టదపుర స్టేషన్ ఎస్‌ఐ శివశంకర్ ఓ కేసును మూసివేస్తానని, ఇందుకు లంచం ఇవ్వాలని సంబంధీకులకు తెలిపాడు. డబ్బులు ఇవ్వలేమని, కేసుతోను తమకు సంబంధం లేదని వారు చెప్పినా ఎస్‌ఐ వినిపించుకోలేదు. దీంతో వారు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బాధితుల నుంచి ఎస్‌ఐ శివశంకర్ రూ.80 వేలు తీసుకుంటూ ఉండగా, లోకాయుక్త అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment