కమనీయం.. వల్లభరాయ వసంతోత్సవం
బనశంకరి: సిలికాన్ సిటీలో ఏడుకొండలవాని దేవస్థానమైన వసంతపుర వసంత వల్లభరాయస్వామి ఆలయంలో వసంతోత్సవం కనుల పండువగా జరిగింది. వల్లభరాయస్వామి ఉత్సవాల్లో భాగంగా శనివారం వేకువజామున సుప్రభాతసేవ అనంతరం అర్చకులు వీఆర్.రఘురామ భట్టర్ నేతృత్వంలో మూలవిరాట్‌కు అభిషేకం, అర్చనలు చేసి సుందరంగా అలంకరించారు. ఉదయం 11.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా వసంత వల్లభరాయస్వామి ఉత్సవమూర్తులను మేళతాళాలతో ఉరేగింపుగా పుష్కరిణికి తీసుకెళ్లి పూజలు చేసి రమణీయంగా వసంతోత్సవం గావించారు. వందలాది మంది భక్తులు పాల్గొని పుష్కరిణిలో స్నానాలు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జే.శ్రీనివాస్‌రెడ్డి, కే.మాదవరావ్, కస్తూరి, ఆలయ ఈఓ జీ.శాంతమ్మ, అకౌంటెంట్ ఎన్.మహేశ్, పురటాశి వెంకటేశ్, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
పుష్కరిణిలో పుణ్యస్నానాలు
తరలివచ్చిన భక్తజనం
కమనీయం.. వల్లభరాయ వసంతోత్సవం
కమనీయం.. వల్లభరాయ వసంతోత్సవం
కమనీయం.. వల్లభరాయ వసంతోత్సవం
Comments
Please login to add a commentAdd a comment