కృష్ణదేవరాయల పాలన జనరంజకం
రాయచూరు రూరల్: మూన్నూరు కాపు సమాజ ప్రజలు శ్రీకృష్ణదేవరాయల ఆదర్శాలను అలవర్చుకోవాలని మాజీ శాసనసభ్యుడు పాపా రెడ్డి కోరారు. శ్రీకృష్ణదేవరాయల జయంతిని పురస్కరించుకుని మూన్నూరు కాపు సమాజం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వీరాంజనేయ కల్యాణ మంటపంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాయల పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో జీవనం సాగించారన్నారు. సాంస్కృతిక కళా రంగాలకు పెద్ద పీట వేశారన్నారు. నరసారెడ్డి, కృష్ణమూర్తి, సర్వ మంగళ, చెన్నారెడ్డి, జ్యోతి, శంకర రెడ్డి, మాజీ సభ్యులు నరస రెడ్డి, మహేంద్ర రెడ్డి, వెంకట రెడ్డి, గోపాలరెడ్డి పాల్గొన్నారు.
కృష్ణదేవరాయల పాలన జనరంజకం
Comments
Please login to add a commentAdd a comment