హంపీ ఉత్సవాలకు ఏర్పాట్లు షురూ
హొసపేటె: విజయనగర సామ్రాజ్య గత వైభవాన్ని చాటిచెప్పే హంపీ ఉత్సవాలు ఈ నెల 28, మార్చి 1, 2న మూడు రోజులు పాటు ఘనంగా జరుగునున్నాయి. ఉత్సవాలకు విజయనగర జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ప్రారంభించింది. హంపీలోని గాయత్రీ పీఠం సమీపంలోని మైదానంలో ప్రముఖ వేదికను రాయలు కాలంనాటి స్మారకాల వాస్తు శైలి నమూనాల పద్దతిలో ఏర్పాటు చేయనున్నారు. గాయత్రీ పీఠం సమీపంలో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన వేదికను నిర్మిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా 4 ప్రధాన ప్రదేశాల్లో వేదికలను ఏర్పాటు చేయనున్నారు. దీనితో పాటు బసవన్న మంటపం ఆవరణ, విరూపాక్ష ఆలయ ఆవరణ, సాసివెకాళు గణపతి మంటపం సమీపంలో వేదికలపై దేశ ప్రఖ్యాత కళాకారులు తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
ఐదు ఎకరాల్లో ప్రధాన వేదిక
రాయల కాలం నాటి వాస్తుశైలితో పనులు
హంపీ ఉత్సవాలకు ఏర్పాట్లు షురూ
హంపీ ఉత్సవాలకు ఏర్పాట్లు షురూ
హంపీ ఉత్సవాలకు ఏర్పాట్లు షురూ
Comments
Please login to add a commentAdd a comment