నత్తనడకన కృష్ణా వంతెన పనులు
రాయచూరు రూరల్: రెండు రాష్ట్రాలకు మధ్య కృష్ణా నదిపై వారధిగా ఉన్న రోడ్డు వంతెన పనులు మందకొడిగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి– 167లో కృష్ణా నది వద్ద నూతనంగా వంతెన నిర్మాణ పనులను మూడేళ్ల క్రితం ప్రారంభించింది. అప్పటి నుంచి పనులు నత్తనడకన సాగుతున్నాయి. రాయచూరు తాలూకా దేవసూగూరు వద్ద సరిహద్దు నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు కృష్ణా వరకు గల 2.13 కిలోమీటర్ల పొడవున రెండో వంతెన నిర్మాణానికి రూ.150 కోట్ల మేర నిధులు విడుదల చేశారు. కృష్ణా నదిలో నిత్యం నీటి ప్రవాహం ఉండడంతో పునాదులు వేయడానికి ఆలస్యమైందని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కర్ణాటక, తెలంగాణలకు రాకపోకల సంబంధాలు కల్పించే వంతెనను త్వరలో ప్రారంభించాలని ప్రజాప్రతినిధులు ఊవ్విళ్లూరుతున్నా పనులు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. 2016లో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా, 2019లో అనుమతి లభించింది. 2022లో పనులు ప్రారంభం కాగా మధ్యలో కాంట్రాక్టర్ మరణించడంతో పనులు స్తంభించాయి. తిరిగి పనులు చేపడుతున్నారు. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సారిగా బోస్ట్రింగ్ మాదిరిగా వంతెన నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. కృష్ణా నదిపై విల్లు ఆకారంలో వంతెన నిర్మాణానికి పూనుకున్నారు. ప్రతి 83.5 మీటర్లకు కమానును ఏర్పాటు చేస్తున్నారు.
మూడేళ్ల క్రితం పనులు ప్రారంభం
ఏళ్ల తరబడి ఇంకా పూర్తి కాని వైనం
నత్తనడకన కృష్ణా వంతెన పనులు
నత్తనడకన కృష్ణా వంతెన పనులు
Comments
Please login to add a commentAdd a comment