నీటి ఎద్దడి తీవ్ర రూపం
రాయచూరు రూరల్ : రాయచూరులో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. ఏవీధిలో చూసినా నీటి కోసం హాహాకారాలు మిన్నంటుతున్నాయి. నగరానికి సమీపంలోని రాంపురం రిజర్వాయర్ నుంచి తుంగభద్ర జలాలు సరఫరా చేస్తున్నారు. అక్కడ తగినంత నీటి నిల్వలు లేవు. ఈక్రమంలో మూడు రోజులుగా 1 నుంచి 10వ వార్డు వరకు తాగునీరు సరఫరా కాలేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శుద్ధజల నీటి పథకాలు మరమ్ములకు గురవ్వడంతో నీటి సరఫరా ఆగిపోయింది. అయినప్పటికీ అధికారులు స్పదించడం లేదు. గత్యంతరం లేక ప్రజలు కిలోమీటర్ల దూరం వెళ్లి బోరు నీటిని తెచ్చుకుంటున్నారు. మరో వైపు నీటి కోసం నగరంలో రోజూ ఏదో ఒక ప్రాంతంలో ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం పలు కాలనీల్లో మహిళలు రోడ్డెక్కారు. రోజుల తరబడి నీటి సరఫరా ఆగిపోయినా పాలకులు, అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు. చుక్కనీటి కోసం తాము పడరాని పాట్లు పడుతున్నామని వాపోయారు. ఇదిలా ఉండగా శుద్ధ జల ప్లాంట్ల మోటార్లు మరమ్మతుకు గురయ్యాయని, వాటిని సరి చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్నారు.
సరిగ్గా పనిచేయని నీటి పథకాలు
మరమ్మతుకు గురైన మోటార్లు
రాయచూరులో హాహాకారాలు
మూడు రోజులుగా అందని నీరు
ఖాళీ బిందెలతో నిరసనలు
నీటి ఎద్దడి తీవ్ర రూపం
Comments
Please login to add a commentAdd a comment