ఉదయగిరి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి
హుబ్లీ: హుబ్లీ: అసాంఘిక శక్తులతో సర్కారు కుమ్మక్కు అయ్యిందని, ఇందుకు రాష్ట్రంలో పదేపదే జరుగుతున్న అలర్లు నిదర్శనమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి ఆరోపించారు. స్థానిక మీడియాతో పాత హుబ్లీ, కేజేహళ్లి, డీజేహళ్లి, మైసూర్ ఉదయగిరిలో జరిగిన అలర్లు సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడల్లా అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయన్నారు. ఉదయగిరిలో జరిగిన ఘటన పథకం ప్రకారం జరిగిందన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు. పాత అలర్ల కేసుల నిందితులపై చర్యలు తీసుకొని ఉంటే ఉదయగిరి లాంటి అలర్లు పునరవృతం అయ్యేవి కాదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పీఎఫ్‌ఐ, ఎస్‌బీపీఐ, సంఘాలపై కేసులను రద్దు చేశారన్నారు. కాంగ్రెస్ కలహాలు రాష్ట్రంలో పాలనపై వ్యతిరేక ప్రభావం చూపుతున్నాన్నారు. దళితులు సీఎం కావడంపై బీజేపీలో వ్యతిరేకత లేదన్నారు. అయితే ఈ విషయాన్ని వీధి జగడం చేసి పాలనను అస్తవ్యస్తం చేస్తే రాష్ట్ర ప్రజలు సహించరన్నారు.
దళిత సీఎంపై చర్చ జరగలేదు
హుబ్లీ: కాంగ్రెస్ పార్టీలో దళిత సీఎం విషయంపై ఎటువంటి చర్చ జరగలేదని ఎమ్మెల్సీ సలీం అహ్మద్ అన్నారు. ఆదివారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీతో పాటు అన్ని సమాజాల సమావేశాలు గతం నుంచి సాధారణంగా జరుగుతున్నాయని తెలిపారు. పార్టీ అంతర్గత విషయాల గురించి మాట్లాడకూడదని హైకమాండ్ సూచించిందన్నారు. కేపీసీసీ అధ్యక్షుడి మార్పు, సీఎం మార్పు గురించి అందరితో చర్చించి హైకమాండ్ తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. సీఎం సిద్దరామయ్య, డీకే.శివకుమార్ తమ పదవులను సమర్థవంతంగా నిర్వర్థిస్తున్నారన్నారన్నారు. మంత్రివర్గ విస్తరణతో పాటు పార్టీలోని అన్ని నిర్ణయాలను హైకమాండ్ తీసుకుంటుందన్నారు. అంతకు ముందు ఆయన స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చారు. పార్టీ సంఘటితం గురించి చర్చలు జరిపారు. ఎమ్మెల్యేలు ఎన్‌హెచ్ కోనరెడ్డి, ప్రసాద్ అబ్బయ్య, పార్టీ జిల్లాధ్యక్షుడు అనిల్‌కుమార్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
బస్సు ఢీకొని బైకిస్టు దుర్మరణం
హొసపేటె: కారటగి తాలూకా మరలనహళ్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. సిద్దాపూర్ గ్రామానికి చెందిన మంజునాథ్ హండ్ర (30) రవినగర్‌లోని ఓ రైస్ మిల్లులో పని చేస్తున్నాడు. బ్యాంకులో డబ్బు జమ చేసేందుకు కారటగిలోని బ్యాంక్‌కు బైక్‌పై వెళ్తుండగా దారిమధ్యలో మర్లనహళ్లికి చెందిన ఖాసీమ్ డ్రాప్ అడిగాడు. అతన్ని ఎక్కించుకొని వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొంది. మంజునాథ్ మృతి చెందగా ఖాసీం గాయపడ్డాడు. కారటగి పోలీసులు క్షతగాత్రున్ని గంగావతిలోని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు
గోదాముపై అధికారుల దాడి
హుబ్లీ: అంగన్‌వాడీ కేంద్రంలోని పిల్లలు, గర్భిణిలకు పంపిణీ చేయాల్సిన కందిపప్పు, బియ్యం, బెల్లం, గోధుమలు, పాలు పౌడర్, పెసరపప్పు తదితర వాటిని కబ్బూరు సర్కిల్ వద్ద ఉన్న ఒక గోదాములో నిల్వ చేసినట్లు గుర్తించి అధికారులు ఆదివారం దాడి చేశారు. 300 బస్తాల్లోని సరుకులను స్వాధీనం చేసుకున్నారు. అంగన్‌వాడీ కార్యకర్త బతూల్ భర్త ఫరుఖ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దాడుల్లో అసిస్టెంట్ కమిషనర్ సలాం హుస్సేన్, తహసీల్దార్ కల్లనగౌడ పాటిల్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ జిల్లా డిప్యూటి డైరెక్టర్ హెచ్ హులిగమ్మ కుకనూర, కసబపేట పోలీస్ స్టేషన్ సీఐ రాఘవేంద్ర అల్లూర, గోడౌన్‌కు వెళ్లి పరిశీలించారు.
ఘనంగా పల్లకీ ఉత్సవం
హొసపేటె: కొట్టూరు తాలూకా ఉజ్జయినిలో ఆదివారం శ్రీ మురుళసిద్దేశ్వర స్వామి పల్లకీ ఉత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్థానికులతోపాటు పరిసర ప్రాంతాల ప్రజల ఆలయానికి తరలివచ్చి స్వామి వారికి, జగద్గురువులు సిద్దలింగ రాజదేశీ కేంద్రం భగవత్పాద శివాచార్యుల వారికి పూజలు సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఉదయగిరి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి
Comments
Please login to add a commentAdd a comment