అపోహలు వీడితే మూర్చ వ్యాధి నుంచి విముక్తి
హొసపేటె: మూర్చవ్యాధి గురించిన అజ్ఞానం, అపోహల నుంచి సామాన్య ప్రజలు బయటకు రావాలని అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్.హరిప్రసాద్ సూచించారు. నగర జిల్లా యంత్రాంగం, జెడ్పీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా మానసిక ఆరోగ్య విభాగం, సమాచార, ప్రజా సంబంధాల శాఖ, తాలూకా ఆరోగ్య అధికారి కార్యాలయం, రాఘవేంద్ర పారామెడికల్ కళాశాల సహకారంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మూర్చ దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మూర్చ వ్యాధి గురించి భయపడకుండా, సరైన మందులు తీసుకునేలా అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ మూర్ఛ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూర్చ చికిత్స చేయగల వ్యాధి అని, సరైన మందులు తీసుకోవడం ద్వారా మూర్చను నయం చేయవచ్చన్నారు. ఒక వ్యక్తికి మూర్చ వచ్చినప్పుడు వీడియో తీయాలన్నారు. ఇది వైద్యులు వారికి చికిత్స చేయడంలో సహాయ పడుతుందన్నారు. రోగి స్పృహ కోల్పోయినప్పడు వారిని లాక్ చేసిన స్థితిలో ఉంచరాదన్నారు. స్పృహ కోల్పోయిన సందర్భంలో రోగికి ప్రథమ చికిత్స అందించి,సమీపంలోని ఆస్పత్రికి తరలించాలన్నారు వైద్యులు భరత్, రాధిక, ఆశా కోరి, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment