హక్కుల రక్షణపై అప్రమత్తంగా ఉండండి
రాయచూరు రూరల్: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, సాంఘీక సంక్షేమ హాస్టళ్లలో పిల్లల హక్కుల రక్షణ చట్టాన్ని అనుసరించి అధికారులు అప్రమత్తంగా మెలగాలని కర్ణాటక రాష్ట్ర పిల్లల హక్కుల రక్షణ చట్టం కమిషన్ అధ్యక్షుడు కె.నాగనగౌడ సూచనలు జారీ చేశారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాల విద్యార్థులపై లైంగిక దాడులు, రోడ్డు ప్రమాదాలు, వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై అధికారులతో చర్చించారు. పిల్లల హక్కుల రక్షణ చట్టం–2016ను అధికారులు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఆర్టీఓ అధికారులు వాహనాలను పరిశీలించాలన్నారు. ఆర్టీసీ అధికారులు విద్యార్థులకు, గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ పుట్టమాదయ్య, అదనపు ఎస్పీ హరీష్, డీఎస్పీ సత్యనారాయణ, అమరేష్‌లున్నారు.
Comments
Please login to add a commentAdd a comment