హుబ్లీ: దాంపత్యంలో అన్యోన్యంగా దాదాపు 60 ఏళ్ల పాటు బతుకు నెట్టుకొచ్చిన ఆ వృద్ధ దంపతులు కష్టాలు, కన్నీళ్లలోనే కాదు మరణంలోను ఒకరికొకరు తోడు అంటూ ఇద్దరు ఒకే రోజే పరమపదించారు. ధార్వాడ సమీపంలోని దేవరహుబ్బళ్లి గ్రామానికి చెందిన రైతు దంపతులు ఈశ్వర అరేర (82), ఆయన సతీమణి పారవ్వ అరేర(73) సోమవారం తెల్లవారు జామున తమ నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. నలుగురు కుమార్తెలు, 12 మంది మనవళ్లుతో నిండు సంసారంతో పాటు అపారమైన బంధుమిత్రులను ఈ దంపతులు విడిచి వెళ్లారు. గత కొన్ని నెలల నుంచి పారవ్వ వయో సహజ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేది. ఆదివారం రాత్రి కూడా ఎంచక్కగా ఇద్దరూ కలిసి భోజనం చేసి అందరికీ చెప్పి పడుకున్నారు. అయితే సూర్యదయం తోటే ఇద్దరు మృతి చెందారు. బతుకు సమరంలోనే కాక చావులోనూ ఒక్కటిగా నిలిచిన ఈ దంపతులను చూసి ఆ గ్రామస్తులంతా కన్నీరు మున్నీరయ్యారు. సోమవారం వీరి అంత్యక్రియలు నెరవేర్చారు.
తోడునీడగా బతికారు.. చివరికి తోడుగానే ఈ లోకం నుంచి నిష్క్రమించారు..
Comments
Please login to add a commentAdd a comment