ఎలుగుబంటి దాడిలో రైతుకు గాయాలు
హుబ్లీ: పొలానికి వెళ్లిన రైతన్నపై ఎలుగుబంటి దాడికి తీవ్రంగా గాయపడిన ఘటన జిల్లాలోని కలఘటిగి తాలూకా ఇతేనహళ్లి తాండాలో చోటు చేసుకుంది. ఆ తాండ నివాసి మారుతీ రామప్ప రాథోడ(56) ఎలుగుబంటి దాడికి గురైన వ్యక్తి. ఆయన పంటపై దాడి చేస్తున్న కోతులను వెంటపడి తరుముతుండగా ఎలుగుబంటి ఆకస్మికంగా దాడి చేసింది. దీంతో ఆయన తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. తక్షణమే ఆయన్ను కలఘటిగి తాలూకా ఆస్పత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్సకు హుబ్లీ కేఎంసీ ఆస్పత్రికి తరలించారు. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఇచనహళ్లి గ్రామానికి వెళ్లి పరిశీలించారు. బాధిత రైతుకు అటవీ శాఖ ద్వారా పరిహారం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అడవి అంచున పొలాలు ఉన్న రైతులు అటవీ జంతువుల రాకపోకలపై జాగ్రత్తగా ఉండాలి. ఒంటరిగా సంచరించరాదు. జంతువుల గురించి తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని ఆ జోన్ అటవీ అధికారి అరుణ్‌కుమార్ తెలిపారు.
వేమన రెడ్డి మండలిని
ఏర్పాటు చేయండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో వేమన రెడ్డి సమాజం అభివృద్ధికి వేమన రెడ్డి అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసి, బడ్జెట్‌లో రూ.1000 కోట్ల నిధులు కేటాయించాలని తాలూకా వేమన రెడ్డి సమాజం ఉపాధ్యక్షుడు లక్ష్మీకాంతరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మండలిని ఏర్పాటు చేసి సత్వరం అధ్యక్షుడి నియామకానికి చర్యలు తీసుకోవాలన్నారు. 2014లో సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉండగా మండలిని ఏర్పాటు చేసి నిధులు ప్రకటించారని గుర్తు చేశారు. కళ్యాణ కర్ణాటక ప్రాంతం వారికి అధ్యక్ష పదవిని కేటాయించాలని ఒత్తిడి చేశారు.
పెద్దకర్మకు వచ్చి..
ఇద్దరు మృత్యు ఒడికి
హుబ్లీ: అవ్వ పెద్దకర్మ కార్యాన్ని ముగించుకొని తిరిగి వస్తున్న వేళ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి చెందిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. స్థానిక కేశ్వాపుర గాంధీవాడ నివాసి వికాస్ గోన (21), తన అవ్వ పెద్దకర్మ కార్యానికి సుజీత్ మోండ(17)తో కలిసి ద్విచక్రవాహనంలో వెళ్లారు. తిరిగి కార్యం ముగించుకొని వచ్చేటప్పుడు విద్యానగర్ సిరియూరు పార్కు వద్ద రోడ్డుపై ఉన్న మిట్టపై నియంత్రణ కోల్పోయి జంప్ అయి రోడ్డు పక్కన ఉన్న గ్రిల్‌కు ఢీకొన్నారు. తీవ్రంగా గాయపడిన వీరిని కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించినా ఫలితం దక్కలేదు. ఉత్తర ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
బైక్, బొలెరో ఢీ.. ఇద్దరు మృతి
చెళ్లకెరె రూరల్: బైక్, బొలెరో పికప్ వాహనం ఢీకొనడం వల్ల ఇద్దరు స్థలంలోనే మృతి చెందిన ఘటన చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకా హాగలకెరె వద్ద ఆదివారం రాత్రి జరిగింది. మృతులను బైక్ నడుపుతున్న శివణ్ణ(53), నాగరాజ్ (45)గా గుర్తించారు. వీరిది చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా వడ్డరహళ్లి. ఘటన స్థలానికి శ్రీరామపుర పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ మధు, పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. శ్రీరామపుర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
వైభవంగా నీరమాన్వి
యల్లమ్మ దేవి రథోత్సవం
రాయచూరు రూరల్: మాన్వి తాలూకా నీరమాన్విలో యల్లమ్మ దేవి జాతర వైభవంగా జరిగింది. సోమవారం వేలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. రాయచూరు, లింగసూగూరు, సింధనూరు, మాన్వి, ఆదోని, కర్నూలు, హైదరాబాద్, బళ్లారి, మహబూబ్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జయదేవకు సన్మానం
కోలారు: బంగారుపేటెలో జరిగిన రేణుకా యల్లమ్మ జాతర మహోత్సవంలో కోలారు జిల్లా సవదత్తి రేణుకా యల్లమ్మ బళగ గౌరవ అధ్యక్షుడు కె జయదేవ్ సమాజానికి అందించిన సేవలను గుర్తించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ ఎం.మల్లేష్‌బాబు, బంగారుపేటె ఎమ్మెల్యే ఎస్‌ఎన్ నారాయణస్వామి, మాజీ ఎంపీ ఎస్.మునిస్వామి, మాజీ ఎమ్మెల్యే బీపీ వెంకటమునియప్ప తదితరులు పాల్గొన్నారు.
ఎలుగుబంటి దాడిలో రైతుకు గాయాలు
ఎలుగుబంటి దాడిలో రైతుకు గాయాలు
ఎలుగుబంటి దాడిలో రైతుకు గాయాలు
Comments
Please login to add a commentAdd a comment