ఫుట్‌పాత్ దుకాణదారుల ర్యాలీ
రాయచూరు రూరల్: జాతీయ రహదారిలో ఉన్న పుట్‌పాత్ దుకాణాలను తొలగించడం తగదని వీధి వ్యాపారుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో గౌరవాధ్యక్షుడు అమరేష్ మాట్లాడారు. రాయచూరు– హైదరాబాద్ జాతీయ రహదారిలో ఫుట్‌పాత్‌లపై వెలసిన, నిర్మించుకున్న దుకాణాల తొలగింపునకు సిటీ కార్పొరేషన్ అధికారులు శ్రీకారం చుట్టారన్నారు. ముందుగా వ్యాపారులకు తగిన పరిహారం అందించాలన్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లో తీసుకున్న అప్పులను తీర్చడానికి ఇబ్బందిగా మారిందన్నారు. వీధుల్లో పుట్‌పాత్ వ్యాపారులకు పరిహారం, ప్రత్యామ్నాయం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
విద్యార్థులకు శాపంగా ఫ్లైయాష్ వాహనాలు
రాయచూరు రూరల్: కాడ్లూరు నుంచి విద్యనభ్యసించడానికి శక్తినగర్‌కు వచ్చే విద్యార్థులకు ఫ్లైయాష్ వాహనాలు శాపంగా పరిణమించిన ఘటన సోమవారం శక్తినగర్ వద్ద చోటు చేసుకుంది. శక్తినగర్, అరషిణిగి, కారేకల్, రంగాపూర్, వడగేర, దేవదుర్గ తదితర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విద్యార్థులు సంచరించడానికి ఇబ్బందికరంగా మారింది. ఈ ప్రాంతంలో ఫ్లైయాష్‌ను తరలించే వాహనాలు ఈ దారిలోనే సంచరించడంతో ఇరువైపుల దారి చిన్నదిగా మారి ప్రయాణానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఫ్లైయాష్‌ను తరలించే వాహనాలు ఇష్టమొచ్చినట్లు నిలపడంతో పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థులు నడుచుకుంటూ వెళ్లారు.
కుంటలతో నీటి ఎద్దడి దూరం
రాయచూరు రూరల్: తాలూకాలోని గ్రామాల్లో వేసవిలో నీటి ఎద్దడి నివారణకు నీటి గుంటలే శరణ్యం అవుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉద్యోగ ఖాత్రి పథకం(నరేగ)లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామాల్లో వ్యవసాయ నీటి కుంటలు తవ్వారు. దీంతో గ్రామంలో వేసవిలో నరేగ పథకంలో గ్రామీణ కూలీకార్మికుల సంఘం కూలీలకు తాగునీటి ఎద్దడి, పఽశువులకు, పక్షులకు తాగడానికి అవకాశం కలిగింది. కూలీ కార్మికులు చేసిన పనికి సరైన కూలీ డబ్బులు చెల్లించక పోవడాన్ని కూలీలు తప్పుబడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన దాని కంటే అధిక మొత్తంలో గుంతలను తవ్వారు. నేడు గ్రామాల్లో ఆ కుంటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
సింథటిక్ ట్రాక్
నిర్మాణానికి డిమాండ్
రాయచూరు రూరల్: మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో సింథటిక్ ట్రాక్ నిర్మాణం చేపట్టాలని మాజీ శాసన సభ్యుడు, జిల్లా అథ్లెటిక్ సంఘం అధ్యక్షుడు పాపారెడ్డి పేర్కొన్నారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 2001–02లో సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి రూ.2.91 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. అనంతరం ప్రభుత్వం ఆ నిధులను ఉపసంహరించుకున్నారన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు సింథటిక్ నిర్మాణానికి నిధులు విడుదల చేయించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేతకు
ఈడీ నోటీసులు?
రాయచూరు రూరల్ : కాంగ్రెస్ పార్టీ వెనుక బడిన వర్గాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ.మారెప్పకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమా చారం అందింది. బెంగళూరు ఈడీ కార్యాలయం నుంచి చరవాణిలో ఇందుకు సంబంధించి సంభాషణ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత ఏడాది నుంచి బెంగళూరులో సొంత పనులపై ఉంటున్న నేపథ్యంలో అక్రమ ఆస్తులను గడించినట్లు సమాచారం అందుకున్న అధికారులు నోటీసులు పంపించడానికి సమాచారం అడిగినట్లు తెలిసింది.
ఫుట్‌పాత్ దుకాణదారుల ర్యాలీ
ఫుట్‌పాత్ దుకాణదారుల ర్యాలీ
ఫుట్‌పాత్ దుకాణదారుల ర్యాలీ
ఫుట్‌పాత్ దుకాణదారుల ర్యాలీ
Comments
Please login to add a commentAdd a comment