క్రీడల్లో గెలుపోటములు సహజం
రాయచూరు రూరల్ : క్రీడల్లో గెలుపు ఓటమిలు సహజం, వాటిని సమానంగా స్వీకరించాలని జిల్లాధికారి నితీష్ అభిప్రాయపడ్డారు. సోమవారం వ్యవసాయ విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ, జెడ్పీ ఆధ్వర్యంలో 2024–25వ సంవత్సరానికి ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా స్థాయి వార్షిక క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. విధి నిర్వహణలో బిజీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులు మానసికంగా, శారీరకంగా ఎదుగుదలకు క్రీడలు దోహదపడతాయన్నారు. క్రీడా పోటీల్లో 8 జట్లకు చెందిన సుమారు 600 మంది అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ ఉప కార్యదర్శి శశికాంత్, అధికారులు శరణ బసవ, రోణ, విజయ్ శంకర్, కృష్ణ, వీరేష్ నాయక్‌లున్నారు.
క్రీడల్లో గెలుపోటములు సహజం
క్రీడల్లో గెలుపోటములు సహజం
Comments
Please login to add a commentAdd a comment