భూ సమస్యలు తీర్చాలని రైతుల ధర్నా
కోలారు: భూ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం పదాధికారులు సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. సంఘం రాష్ట్ర కార్యాధ్యక్షుడు అబ్బణి శివప్ప మాట్లాడుతూ జిల్లాలో రైతులు అంతర్జాలం సాయంతో ఉత్తమ పంటలను పండిస్తున్నారు. ప్రభుత్వ గోమాళం భూములను పలువురు రైతులు సాగు చేసుకుంటూ వాటిని తమ పేరు మీద ఖాతా చేసి ఇవ్వాలని దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడిచినా ఇంతవరకు ప్రభుత్వం రైతుల డిమాండ్లను పట్టించుకోవడం లేదన్నారు. భూ మంజూరు సమితి లబ్ధిదారులను ఎంపిక చేసినా అర్జీలను సరిగా పరిశీలించకుండా వాటిని తిరస్కరించడం ఎంతవరకు సమంజసమన్నారు. అర్జీలను తిరస్కరించడానికి తగిన కారణాలు కూడా అధికారులు తెలపడం లేదన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు బేడశెట్టిహళ్లి రమేష్ మాట్లాడుతూ రైతులకు మంజూరు చేసిన భూములను కొలతలు వేయడం ద్వారా పి– నెంబర్లను తొలగించి కొత్త సర్వే నెంబర్లు ఇవ్వాలని, బగర్‌హుకుం సాగు రైతులకు భూములను ఖాతాలు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో హసిరు సేన రాష్ట్ర సంచాలకుడు కె.ఆనంద్‌కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిసనహళ్లి బైచేగౌడ, మహిళా సంచాలకురాలు రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment