జాగృతితో రోడ్డు ప్రమాదాలకు చెక్
రాయచూరు రూరల్: రోడ్డు ప్రమాదాల నియంత్రణలో ప్రజల పాత్ర ముఖ్యమని ఎస్పీ పుట్టమాదయ్య పేర్కొన్నారు. సోమవారం పాత జిల్లాధికారి కార్యాలయం వద్ద రోడ్డు సురక్షతా సప్తాహ– 2025 కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. వాహనాలను నడిపే ముందు రోడ్లలో ప్రయాణించే సమయంలో సంచార నియమాలను, తగిన జాగ్రత్తలను పాటించాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో ప్రచారం చేయడానికి జాగృతి జాతాను నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్టీఓ వినయ్ కాటికోర్, ఏఆర్టీఓ సిబ్బంది శివశంకర్, సిద్దయ్య స్వామి, సుధా పరిమళ, అర్జున్, జీనత్ సాజిద్, హుసేన్, సయ్యద్ సాజిద్‌లున్నారు.
జాగృతితో రోడ్డు ప్రమాదాలకు చెక్
Comments
Please login to add a commentAdd a comment