గురుకుల భవనానికి భూమిపూజ
కోలారు : వృద్ధాప్యంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపరాదని సమాజ సేవకుడు సీఎంఆర్ శ్రీనాథ్ తెలిపారు. వృద్ధులను ఇంట్లోనే పెట్టుకుని పోషించే మనోభావాన్ని పిల్లలు పెంచుకోవాలన్నారు. ఆదివారం తాలూకాలోని నేర్నహళ్లి ద కింగ్ డం ఎడ్యుకేషన్ ట్రస్టు నుంచి నూతనంగా రూ.2.25 కోట్ల వ్యయంలో నిర్మిస్తున్న శ్రీసత్యసాయి బాబా గురుకుల కట్టడ పనులను ప్రారంభించి మాట్లాడారు. అనివార్య కారణాలతో వృద్ధాప్యంలో ఉన్న వారిని వారి కుటుంబ సభ్యులు పోషించడానికి నిరాకరించిన సందర్భాల్లో వృద్ధాశ్రమాలు వారికి ఆసరా ఇచ్చి ప్రశాంత జీవితాన్ని అందిస్తున్నాయన్నారు. నేర్నహళ్లి సమీపంలో కరోనా కష్ట కాలంలో సత్యసాయి వృద్ధాశ్రమం, యోగా, ధ్యాన మందిరం ప్రారంభించి నేడు 50 మందికి పైగా వృద్ధులకు ఆశ్రయం ఇస్తున్న సురేష్‌కుమార్ కుటుంబం చేస్తున్న సేవలు శ్లాఘనీయమన్నారు. ప్రస్తుతం అనాథ పిల్లల కోసం గురుకులం ప్రారంభిస్తున్నారన్నారు. సత్యసాయి వృద్ధాశ్రమ సంస్థాపకుడు సురేష్‌కుమార్, జేడీఎస్ నాయకుడు బణకనహళ్లి నటరాజ్, సమృద్ధి సుధాకర్, రామాంజినప్ప పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment