రాయచూరు రూరల్: రాష్ట్రంలో వెనుక బడిన జిల్లాల్లో గిరిజన పిల్లలకు ప్రత్యేక హాస్టళ్లను మంజూరు చేయాలని గిరిజన వర్గాల కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రారష్ట్‌ర ప్రభుత్వం 2023లో అధికారం చేపట్టిన వెంటనే గిరిజన అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసినా నిధులు కేటాయించక పోవడాన్ని ఖండించారు. అత్యధికంగా కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో రాయచూరు జిల్లాలో అధిక భాగం గిరిజన ప్రజలు నివాసం ఉంటున్నారన్నారు. వారికి మౌలిక సౌకర్యాలు కల్పించడంలో అలసత్వం చూపుతున్నారన్నారు. అంబేడ్కర్ కార్మిక సహాయ హస్త పథకం ద్వారా 20 అసంఘటిత కార్మికులకు పరిహారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment