తాగునీటి ఎద్దడి నివారించండి
రాయచూరు రూరల్: నగర వాసులకు వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాంపుర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు. సగానికి పైగా నగర ప్రజలు తుంగభద్ర కాలువ నీటిపై ఆధారపడ్డారన్నారు. నగరానికి వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు రాంపుర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద అదనంగా 10 ఎకరాల స్థలంలో నూతనంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి సర్వే చేయాలని ఆదేశించారు. కృష్ణ, తుంగభద్ర కాలువల నుంచి లింక్ చేసి నీటిని నింపాలన్నారు. జిల్లాధికారి నితీష్, కమిషనర్ జుబిన్ మహాపాత్ర, ఏసీ గురుసిద్దయ్య, సభ్యులు జయన్న, రమేష్, నేతలు రవీంద్ర, హరిబాబు, తిమ్మారెడ్డి, నరసింహులు, బసవరాజ్, అమరేగౌడ, శాంతప్ప, యల్లప్ప, మునిస్వామి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment