కూలి కార్మికులకు రైతన్న విమాన భాగ్యం
సాక్షి,బళ్లారి: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకా సిరిగినహళ్లిలో ఓ రైతు తన పొలంలో వ్యవసాయ పనులు చేసే మహిళా కూలీ కార్మికులకు విమానంలో ప్రయాణించే భాగ్యాన్ని రైతు కల్పించారు. గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే రైతు తోటలో నిత్యం కూలీ పనులు చేసే మహిళా కూలీలు తమ మనసులోని మాటను పంచుకున్నారు. తమకు విమానంలో ప్రయాణించాలని ఆశగా ఉందని చెప్పుకోవడంతో నిత్యం పొలంలో పనులు చేస్తూ సహాయం అందిస్తున్న కూలీ కార్మికులకు సదరు రైతు శివమొగ్గ నుంచి గోవా వరకు విమానంలో ప్రయాణించేందకు తానే మొత్తం ఖర్చులు భరించి కూలీ కార్మికుల ఆశను నెరవేర్చడంతో మహిళా కూలీ కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో మహిళా కూలీకార్మికులు రైతుతో కలిసి తీసుకున్న ఫోటో వైరల్‌గా మారింది.
జిల్లాధికారి కార్యాలయంలో సహాయవాణి ప్రారంభం
హుబ్లీ: రాష్ట్రంలో వీఏఓల సమ్మె ఫలితంగా కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల పంపిణీలో జాప్యం జరుగుతోంది. దీంతో విద్యార్థులకు పరీక్షలు, నియామక ఉద్దేశాల కోసం సత్వరంగా ప్రమాణ పత్రాలను పొందే దిశగా స్పందనకు జిల్లాధికారి కార్యాలయంలో సహాయవాణిని ప్రారంభించారు. సదరు ఆదాయ పత్రం తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే విద్యార్థులు, ప్రజలు జిల్లా ఏజేఎస్ కన్వీనర్‌ను 8277862923, లేదా 08362233880 నెంబరులో సంప్రదిస్తే తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి కుల ఆదాయ ధృవీకరణ పత్రం పంపిణీలో జరిగే జాప్యాన్ని నివారిస్తారని జిల్లాధికారిణి దివ్యప్రభు ఏ ప్రకటనలో తెలిపారు.
వీఏఓల సమ్మెకు మద్దతు
బళ్లారిటౌన్: రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని గ్రామ పాలన అధికారులు(వీఏఓలు) చేపడుతున్న సమ్మెకు డాక్టర్ అంబేడ్కర్ సంఘర్షణ సమితి మద్దతు తెలిపింది. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం ఎదుట ధర్నాకు కూర్చొన్న ఆందోళన కారుల సమ్మెకు మద్దతు తెలిపి సమితి నేతలు మాట్లాడారు. వీఏఓలు రైతుల సంక్షేమం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. వారు కోరుతున్న న్యాయసమ్మతమైన డిమాండ్లను కల్పించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సమితి సంస్థాపక అధ్యక్షుడు మహేష్ కురువళ్లి, ఉపాధ్యక్షుడు కేఎం.మల్లేశ్, వెంకటేష్, పదాధికారులు విశ్వనాథ్, కొర్లగుంది పంపాపతి, చంద్రశేఖర్, హిమంత్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
జానపద కళలపై
అవగాహన అవసరం
హుబ్లీ: పిల్లలకు జానపద కళలు, సాహిత్యంపై అవగాహన అవసరమని రాజ్యోత్సవ ప్రశస్తి విజేత ఇమామ్ సాబ్ వల్లప్పనవర తెలిపారు. కర్ణాటక విద్యావర్థక సంఘంలో ప్రజ్వల ఔత్సాహిక కన్నడ, కొంకణి కళా సంఘం ధార్వాడ, కన్నడ సంస్కృతి శాఖ సహకారంతో జానపద సంభ్రమ, షహనాయి వాదన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జానపద నిపుణులు డాక్టర్ రాము ముళగి మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతిని అధిగమించి నిలదొక్కుకునే శక్తి జానపద కళకు మాత్రమే ఉందన్నారు. యువతలో జానపదం గురించి అవగాహనకు ప్రయోగాత్మక శిక్షణ చాలా అవసరం అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ప్రకాష్ మల్లిగె వాడ, జానపద విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ షాజహాన ముదకవి, శ్రీధర్ భజంత్రి, రవి కులకర్ణి, స్నేహ మహలే తదితరులు పాల్గొన్నారు.
పక్షులకు నీటి తొట్టెల ఏర్పాటు
రాయచూరు రూరల్: నగర ప్రాంతాల్లో ప్రాణి పక్షులకు తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని అస్కిహాళ్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయిని విజయలక్ష్మి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని వన సిరి ఫౌండేషన్, అస్కిహాళ యూకో క్లబ్‌ల ఆధ్వర్యంలో అస్కిహాళ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల చుట్టు పక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న చెట్లు, కొండలు, గుట్టల్లో వేసవి కాలంలో నీటి దాహం తీరడానికి నీటి తొట్టెలు ఏర్పాటు చేశారన్నారు. భవిష్యత్‌లో ఎండవేడిమి నుంచి రక్షణకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు చెట్లు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో సమితి నేతలు ప్రకాష్ పాటిల్, సునీల్, పాఠశాల ఉపాధ్యాయులున్నారు.
కూలి కార్మికులకు రైతన్న విమాన భాగ్యం
కూలి కార్మికులకు రైతన్న విమాన భాగ్యం
Comments
Please login to add a commentAdd a comment