రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు
బళ్లారి రూరల్ : రాష్ట్రంలో విద్యుత్తు కొరత లేదని, వ్యవసాయానికి 7 గంటలు, ఇళ్లకు, పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇంధన శాఖ మంత్రి కేజే.జార్జి పేర్కొన్నారు. మంగళవారం దావణగెరె జెడ్పీ సభాంగణంలో అధికారులు, శాసనసభ్యులకు ఏర్పాటు చేసిన ప్రగతి పరిశీలన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకపోయినా కొన్ని సాంకేతిక సమస్యల వల్ల కొన్ని ప్రాంతాల్లో నిర్వహణ కోసం తక్కువ సరఫరా అవుతోందన్నారు. ప్రభుత్వం నిబద్ధతతో సేద్యానికి 7 గంటల విద్యుత్ ఇవ్వాలని కట్టుదిట్టమైన సూచనలు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతినిత్యం 18,500 మెగావ్యాట్ల విద్యుత్ అవసరం ఉందన్నారు. అయితే అంతకంటే 10 శాతం వినియోగం పెరిగిందన్నారు. 3 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని కుసుమ్–సి యోజన ద్వారా ఏడాదిన్నరలో సోలార్ 3 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్నట్లు తెలిపారు.
లైన్‌మెన్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం
రాష్ట్ర ఇంధన శాఖ ఆధ్వర్యంలో 3000 లైన్‌మెన్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. అర్జీల పరిశీలన చివరి దశలో ఉంది. ఈ పోస్టుల కోసం లక్ష మంది అర్హత పొందారన్నారు. ఎంపికై న అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అత్యంత పారదర్శకంగా రిజర్వేషన్ అనుసరించి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇంధన శాఖలో ఎటువంటి ఎస్కాంలు నష్టంలో లేవు. ప్రభుత్వం నుంచి చాలావరకు నిధులు రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వ గ్యారంటీల్లో గృహజ్యోతి యోజనలో అన్ని వర్గాల వారికి 200 యూనిట్ల వరకు బిల్లు లేదు. ఇందులో ఏడాదిలో ఉపయోగించిన యూనిట్లకు 10 శాతం చేర్చి యూనిట్లను నిర్ణయిస్తారన్నారు. ప్రగతి పరిశీలన సమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వివరించారు. సమావేశంలో ఎమ్మెల్యే కె.ఎస్.బసవంతప్ప, లతా మల్లికార్జ్ను, బి.దేవేంద్రప్ప, కేపీటీసీఎల్ ఎండీ డాక్టర్ ఎన్.శివశంకర్, జెడ్పీ సీఈఓ సురేశ్ బి.హిట్నాళ్, అదనపు జిల్లాధికారి పీ.ఎస్.లోకేశ్, జెస్కాం కమీషనర్ ఇంజినీర్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
సేద్యానికి 7 గంటలు, గృహ,
పరిశ్రమలకు నిరంతర విద్యుత్
జెడ్పీ ప్రగతి పరిశీలన సమావేశంలో
ఇంధన శాఖ మంత్రి జార్జి
Comments
Please login to add a commentAdd a comment