సిడిబండి రథోత్సవంపై సమీక్ష
బళ్లారిటౌన్: మార్చి 11న జరగనున్న కనకదుర్గమ్మ దేవస్థానం సిడిబండి రథోత్సవాన్ని వైభవంగా జరపాలని సిటీ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి సూచించారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం సభాంగణంలో జరిగిన ముందస్తు సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఉత్సవాలను సంప్రదాయ బద్ధంగా జరుపుకోనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి లోపదోషాలు లేకుండా చూడాలన్నారు. దీని కోసం గాణిగ సముదాయం సలహాలు పొందాలని దేవస్థానం ఈఓను ఆదేశించారు. ఈ ఉత్సవాలకు సుమారు 4 లక్షల మంది భక్తాదులు రావచ్చని, వీరందరికీ తాగునీరు, వాహనాల పార్కింగ్, విద్యుత్ సదుపాయం, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
తాగునీటి కోసం అన్ని ఏర్పాట్లు
జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా మాట్లాడుతూ భక్తాదులు తాగునీటి కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్నదాసోహ కార్యక్రమానికి ఆహార ధాన్యాలను పరీక్షించాలని ఆరోగ్య అధికారులకు సూచించారు. దేవస్థానం చుట్టు పక్కల ఎప్పటికప్పుడు పరిశుభ్రత కాపాడాలని మహనగర పాలికె అధికారులు సూచించారు. ఇదే దిశలో వివిధ అధికారులకు కూడా వారివారి కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ డాక్టర్ శోభారాణి, పాలికె మేయర్ ముల్లంగి నందీష్, దేవస్థాన ఈఓ హనుమంతప్ప పాల్గొన్నారు.
11న వైభవంగా నిర్వహించండి
సిటీ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి
సిడిబండి రథోత్సవంపై సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment