రాయచూరు రూరల్: మనీ ల్యాండరింగ్ పేరుతో రిటైర్డ్ కేబీజీఎన్‌ఎల్ అధికారికి రూ.10 లక్షల మేర కుచ్చుటోపీ పెట్టిన ఉదంతం యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. యాదగిరి జిల్లా ఽశహాపుర తాలూకా భీమరాయన గుడి కృష్ణా భాగ్య జల నిగమ ప్రాజెక్టు(కేబీజీఎన్‌ఎల్)లో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన అధికారికి ముంబై వ్యక్తులు కుచ్చుటోపీ వేశారు. గతనెల 26న కలబుర్గిలో ఉన్న సమయంలో 7418251915 నంబర్ నుంచి వీడియో కాల్ చేయడం ద్వారా హిందీలో సంభాషణ చేశారు. ముంబై క్రైం బ్రాంచ్ నుంచి అధికారిని మాట్లాడుతున్నట్లు చెప్పి మనీ ల్యాండరింగ్ పేరు మీద మీపై నేరం మోపారని తెలిపారు .మీ బ్యాంక్ ఖాతాలోకి డబ్బుల లావాదేవీల వ్యవహారం జరిగిందంటూ కేసు నమోదు చేశామని చెప్పారు. ఎఫ్‌ఐఆర్ నంబర్ ఎంహెచ్–5621–2024 అంటూ ప్రధాన ముద్దాయి నరేష్ గోయల్‌ను అరెస్ట్ చేశామన్నారు. ఇందులో మీరు రెండో ముద్దాయి అంటూ వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా నంబర్ ఇతర వివరాలు పంపాలని ఆదేశించారు. అపరిచితులు ఫిర్యాదు దారుడికి వీడియో కాల్‌లో ఓ నివాసంలో ఓ న్యాయమూర్తిని సృష్టించి నరేష్ గోయల్‌ను అరెస్ట్ చేసినట్లు చూపించారు. అన్ని వివరాలు వ్యాట్సప్ ద్వారా పంపాలని కోరారు. నిరాకరిస్తే మిమ్ములను అరెస్ట్ చేస్తామని, దాని బారి నుంచి రక్షణ పొందాలంటే మీ కొడుకుకు తెలియకుండా చూడాలని సూచించారు. వివిధ బ్యాంక్ ఖాతాల నుంచి రూ.10 లక్షలను బదలాయించుకుని వంచించారు. ఈ నెల 10న యాదగిరి సీఈఎన్ పోలీస్ స్టేషన్‌లో కేసును పోలీసులు నమోదు చేసుకున్నారు.
డిజిటల్ అరెస్ట్ పేరుతో నయవంచన
రిటైర్డ్ అధికారికి రూ,10 లక్షల మోసం
యాదగిరి జిల్లాలో ఘటన వెలుగులోకి
Comments
Please login to add a commentAdd a comment