మైసూరు: గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారిణి(పీడీఓ), పంచాయతీ అధ్యక్షుల మధ్య నిధుల విషయంలో గొడవ జరిగి, పీడీఓ చెప్పుతో కొట్టుకున్న ఘటన జిల్లాలోని హుణసూరు తాలూకాలో జరిగింది. వివరాలు.. హనగోడు పీడీఓ డాక్టర్ అనిత కాగా, ప్రభుత్వానికి జమ చేయాల్సిన సొమ్ములో రూ.50 వేల వ్యత్యాసం ఉంది. దీనిపై సిబ్బందికి, ఆమెకు మధ్య గొడవ జరుగుతోంది. మరోవైపు అధ్యక్షుడు చెన్నయ్య, పీడీఓ అనిత మధ్య కొన్ని అంశాలపై వాగ్వాదం జరిగింది. ఆవేశానికి గురైన అనిత చెప్పు తీసుకుని తానే కొట్టుకున్నారు. చెన్నయ్య మాట్లాడుతూ నాలుగు నెలల క్రితం జరిగిన ఘటన ఇది అని, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిందని చెప్పారు.
తప్పుడు ఫిర్యాదులు
చేస్తే కేసులే: కమిషనర్
యశవంతపుర: ఎవరైనా పోలీసుస్టేషన్‌కు వెళ్లి తప్పుడు ఫిర్యాదు చేస్తే అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకొంటామని బెంగళూరు పోలీసు కమిషనర్ బీ దయానంద్ హెచ్చరించారు. విలేకరులతో మాట్లాడుతూ ఐదేళ్లలో తప్పుడు ఫిర్యాదు చేసిన ఆరు మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సంపిగేహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో దాడి జరిగిందని ఓ వ్యక్తి తప్పుడు కేసు పెట్టాడని తెలియడంతో అతనిపైనే చార్జిషీటు దాఖలు చేసినట్లు తెలిపారు. అమృతహళ్లిలో వాహన చోరీ అయ్యిందని తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తికి కోర్టు రూ. వంద జరిమానా విధించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment