అక్రమ లేఔట్లపై కొరడా
బనశంకరి: రాష్ట్రంలో అనధికార లేఔట్లు తలెత్తితే అధికారులనే జవాబుదారీ చేసి నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య హెచ్చరించారు. మంగళవారం నివాస కార్యాలయమైన కృష్ణాలో స్థానిక సంస్థల్లో బీ–ఖాతా అందించడం గురించి జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ అధికారులు, కమిషనర్లతో వీడియో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాలు, నగర, పట్టణ, పాలికె పరిధిలో అనధికార లేఔట్లకు చెక్ పెడతామన్నారు. ఇకపై అక్రమ లేఔట్లకు రాష్ట్రంలో అవకాశం లేదన్నారు. అధికారులు చట్ట ప్రకారం పని చేయాలన్నారు. ఒక వేళ మళ్లీ అక్రమ లేఔట్లు తలెత్తితే అక్కడి అధికారులపై చర్యలు తప్పవని తెలిపారు. ఇప్పటికే అనధికార లేఔట్లలో ఇళ్లు నిర్మించుకున్నవారికి ఇబ్బందులు కలగరాదని ఒకేసారి బీ–ఖాతా అభియాన చేపడుతున్నామన్నారు. 3 నెలలు సమయం ఇస్తున్నామని, అంతలోగా బీ–ఖాతా అభియాన ను పూర్తిచేయాలని ఆదేశించారు. ఎలాంటి గందరగోళానికి ఉండరాదన్నారు. ఈ సమావేశంలో మంత్రులు కృష్ణబైరేగౌడ, ఈశ్వర్ ఖండ్రే, బైరతి సురేశ్, రహీంఖాన్, అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు సీఎం ఆదేశం
సక్రమంగా బి–ఖాతా అభియాన్
Comments
Please login to add a commentAdd a comment