దొడ్డబళ్లాపురం: బెంగళూరులోని బాగలగుంటలో భర్త ప్రవర్తన సరిగా లేదనే కోపంతో శృతి (33)అనే మహిళ, కుమార్తె రోహిణి(5)కి ఉరివేసి చంపి, తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో మరో విషయం వెలుగు చూసింది. గతంలో శృతి కుటుంబం ఒక ఇంట్లో అద్దెకు ఉండేవారు. ఆ ఇంటి ఓనర్ భార్య కూడా ఇదే మాదిరిగా డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఆ సంఘటన శృతి మనసులో నాటుకుపోయిందని బంధువులు తెలిపారు. తనకూ అదే సమస్య ఎదురవడంతో అచ్చం అలాగే డేత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుందన్నారు. శృతి భర్త గోపాలక్రిష్ణను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment