శివాజీనగర: డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ సీఎం కావడం గ్యారెంటీ అని పార్టీ నేత వీరప్ప మొయిలీ చెప్పడంతో కాంగ్రెస్‌లో భారీ మార్పులు తప్పవా? అనే ప్రశ్న వినిపిస్తోంది. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను మంగళవారం బెంగళూరులోని సదాశివనగరలోని నివాసంలో శివకుమార్ కలవడం కుతూహలానికి దారితీసింది. భేటీ తరువాత మాట్లాడిన డీకే, నేను ఖర్గే ఇంటికి కాకుండా బీజేపీ ఆఫీస్‌కు వెళ్లాలా? ఖర్గే రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన గౌరవార్థం కలిశాను అని చెప్పారు. కొత్త కాంగ్రెస్ భవన్ ప్రారంభ తేదీ గురించి చర్చించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment