మహిళలు, పురుషులు ఒకే బండికి రెండు చక్రాలు
బళ్లారి టౌన్: మహిళలు పురుషులు ఇద్దరు కూడా ఒకే బండికి రెండు చక్రాల లాంటి వారని, ఇద్దరు సమానంగా కలిసి ప్రయాణిస్తే జీవితంలో లక్ష్యాన్ని సాధించవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవల ప్రాధికార అధ్యక్షురాలు కేజే.శాంతి పేర్కొన్నారు. జిల్లా న్యాయసేవా ప్రాధికారం, జిల్లా న్యాయవాదుల సంఘం, వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నగరంలోని తాళూరు రోడ్డులోని నూతన కోర్టు ఆవరణలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో పురుషుల సాధనలో మహిళ పాత్ర కూడా ఉంటుందన్నారు. అదే విధంగా మహిళల సాధనలో కూడా పురుషుల సహకారం ఉంటుందన్నారు. ఇద్దరూ సమాజానికి రెండు కళ్లు లాంటి వారన్నారు. చట్టంలో మహిళలకు ఉన్న సదుపాయాలను తెలుసుకోవాలన్నారు. సమాజంలో బాల్య వివాహాలు, వరదక్షిణ, లైంగిక వేధింపులు, కుటుంబ దౌర్జన్యం, మానసిక శారీరక హింస వంటి పలు సమస్యలకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. మహిళలు వీటిపై అవగాహన పొందాలన్నారు. జిల్లా కుటుంబ న్యాయమూర్తి సిద్దలింగ ప్రభు, న్యాయమూర్తులు రాఘవేంద్ర గౌడ, బీజీ ప్రమోద, వాసుదేవ రాధాకాంత్ గుడి, రాజేష్ ఎస్ హొసమని, అపర్ణ, నశ్రత్ ముక్త అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎంఎస్‌ఎస్ ఆధ్వర్యంలో..
అఖిల భారత సాంస్కృతిక సంఘం, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఏఐఎంఎస్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల మాట్లాడుతూ మహిళా దినోత్సవం చారిత్రక స్పూర్తి దినోత్సవం అన్నారు. నేడు మహిళల సమస్యలపై గళమెత్తాల్సిన పరిస్థితి ఉందన్నారు. 1918 మార్చి 8న అమెరికాలోని న్యూయార్క్‌లో గార్మెంట్ పరిశ్రమల్లో వేలాది మంది మహిళా కార్మికులు, మహిళలు ఎక్కువ కష్టపడి పని చేస్తున్నా తక్కువ వేతనాలు చెల్లించడం, వారికి వివిధ సెలవులపై నిర్బంధాన్ని నాడు వ్యతిరేకించి చేపట్టిన పోరాటాలతో ఈ మహిళా దినోత్సవం ప్రారంభం అయిందని గుర్తు చేశారు. ఆనాటి పోరాటాలే నేడు ప్రపంచ వ్యాప్తంగా మార్చి 8న మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకునేందుకు దోహదపడిందన్నారు. మహిళల్లో మరింత చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ప్రమోద్, ఉపాధ్యక్షురాలు జే.శాంత, ఏఐఎంఎస్‌ఎస్ జిల్లాధ్యక్షురాలు కేఎం ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
హొసపేటె: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విజయనగర నియోజకవర్గ ఎమ్మెల్యే హెచ్‌ఆర్ గవియప్ప నగరంలోని పునీత్ రాజ్‌కుమార్ జిల్లా స్టేడియంలో బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సామాజిక హక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏటా మార్చి 8న జరుపుతారని అన్నారు. అనంతరం బైక్ ర్యాలీని పునీత్ రాజ్‌కుమార్ జిల్లా స్టేడియం నుంచి ప్రారంభించి హంపీలోని మహానవమి దిబ్బ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాపిత బ్రహ్మకుమారి ఆశ్రమ సభ్యులు, వివిధ సంఘాల పదాధికారులు, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
సదృఢ సమాజ నిర్మాణానికి ముందడుగు వేయాలి
రాయచూరు రూరల్: సదృఢ సమాజ నిర్మాణం కోసం మహిళలు ముందడుగు వేయాలని హైకోర్టు న్యాయమూర్తి ఉమా పేర్కోన్నారు. శనివారం నగరంలోని జిల్లా న్యాయాలయ భవనంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జ్యోతి వెలిగించి మాట్లాడారు. వివేకతుల్యమైన చింతనలు, విలువలతో కూడిన సమాజంలో అభివృద్ధికి అనుగుణంగా సాగాలన్నారు. మహిళల హక్కులు, విధులు, సమానత్వాల మధ్య మహిళలను విధుల్లోకి తీసుకోక పోవడం విడ్డూరమన్నారు. లోక్ అదాలత్‌లో కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మారుతి బగాదే, న్యాయమూర్తులు శ్రీకాంత్, ప్రభు సిద్దప్ప, సిద్దరామప్ప, సాత్విక్, సుధీన్ కుమార్, శ్వేతా సింగ్, హులిగప్ప, మల్లికార్జునలున్నారు.
ఇద్దరూ కలిసి ప్రయాణిస్తే లక్ష్యం సాధ్యం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి కేజే.శాంతి
మహిళలు, పురుషులు ఒకే బండికి రెండు చక్రాలు
మహిళలు, పురుషులు ఒకే బండికి రెండు చక్రాలు
మహిళలు, పురుషులు ఒకే బండికి రెండు చక్రాలు
మహిళలు, పురుషులు ఒకే బండికి రెండు చక్రాలు
Comments
Please login to add a commentAdd a comment