నవలి రిజర్వాయర్‌కు చర్యలు
రాయచూరు రూరల్: తుంగభద్ర డ్యాంలో పూడిక అధికంగా పేరుకుపోవడంతో వృథాగా వెళ్లిపోయే సుమారు 30 టీఎంసీల నీటిని నిలపడానికి కొప్పళ జిల్లా నవలి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు. శనివారం కలబుర్గిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయంలో త్వరలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలతో భేటీ అవుతానని తెలిపారు. ఆ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో చర్చించామన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.15,000 కోట్ల నిధులను, భూస్వాధీనం కోసం రూ.9 వేల కోట్లను కేటాయించామన్నారు. రాష్ట్రంలో భూ గర్భ జలాల పెంపుదలకు నీటిపారుదల రంగానికి బడ్జెట్‌లో రూ.22 వేల కోట్ల నిధులు కేటాయించామని చెప్పారు.
మహిళా రిజర్వేషన్లకు సిద్ధం
రాష్ట్రంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని శివకుమార్ చెప్పారు. కలబుర్గి పీడీఏ మైదానంలో మహిళా దినోత్సవంలో మాట్లాడుతూ గల్లీ (పంచాయతీల) నుంచి ఢిల్లీ వరకు మహిళలకు అవకాశాలు దండిగా ఉన్నాయన్నారు. భూమాతల వంటి మహిళలకు ఉన్నత పదవులను అలంకరించేందుకు అవకాశం కల్పించాలన్నారు. కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
ప్రాజెక్టుకు రూ.15 వేల కోట్లు, భూ సేకరణకు రూ.9 వేల కోట్లు కేటాయింపు
డిప్యూటీ సీఎం వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment