మగువే.. ఈ లోకానికి వెలుగు
తుమకూరు: ప్రతి ఒక్క పురుషుని విజయంలో మహిళ పాత్ర ఉందని, సోదరిగా, తల్లి, స్నేహితురాలిగా ప్రతి పురుషుని విజయాన్ని కాంక్షించేది మహిళేనని, మగువలు లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం అసాధ్యమని వక్తలు కొనియాడారు. శనివారం బెంగళూరు, తుమకూరుతో పాటు రాష్ట్రమంతటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా ప్రగతిశీల సంఘాలు ర్యాలీలు, హక్కుల గురించి జాగృత ప్రదర్శనలు నిర్వహించాయి. మహిళా సేవామణులకు సన్మానోత్సవాలను జరిపారు.
ఆటల పోటీలు
తుమకూరులో మహాత్మాగాంధీ క్రీడాంగణంలో వనితలకు సరదాగా ఆటల పోటీలను నిర్వహించారు. మాజీ ఉప మేయర్ రూపా సహా యువతులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. రూపా మాట్లాడుతూ సీ్త్రలు అన్ని రంగాల్లో దూసుకెళుతున్నారన్నారు. ఆటల పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. అధికారులు రోహిత్ గంగాధర్, సీడీపీఓ సరోజమ్మ, బీసీఎం అధికారిణి నిర్మల, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
మహిళలు లేని ప్రపంచం అసాధ్యం
రాష్ట్రమంతటా ఘనంగా
మహిళా దినోత్సవం
మగువే.. ఈ లోకానికి వెలుగు
మగువే.. ఈ లోకానికి వెలుగు
మగువే.. ఈ లోకానికి వెలుగు
Comments
Please login to add a commentAdd a comment