అన్నదాతలకు సున్నా బడ్జెట్
మండ్య: రాష్ట్ర బడ్జెట్‌లో మైనార్టీలను బుజ్జగించి, రైతులను నిర్లక్ష్యం చేశారంటూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. నగరంలోని జేసీ సర్కిల్‌లో గుమికూడిన కార్యకర్తలు సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేతలు మాట్లాడుతూ సిద్దరామయ్య బడ్జెట్‌లో ముల్లాలు, ముస్లిం ధార్మిక నాయకులకు గౌరవధనాన్ని రూ.6 వేలకు, సహాయకులకు రూ.5 వేలకు పెంచారన్నారు. మైనార్టీలు నివసించే కాలనీలు, బడావణెల అభివృద్ధికి వెయ్యి కోట్లు, అదనపు ఉర్దూ పాఠశాలల నిర్మాణానికి, వాటి అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించి మైనార్టీలను బుజ్జగించారని ఆరోపించారు. కాగా కొన్నిచోట్ల బడ్జెట్‌కు మద్దతుగా సంబరాలు చేసుకున్నారు. కోలారు నగరంలో కాంగ్రెస్ కార్యకర్తలు టపాసులు పేల్చారు.
మహిళా సారథి
● చెత్త వాహనం డ్రైవర్‌గా నందిని ప్రతిభ
చిక్కబళ్లాపురం: మహిళలు కష్టమైన డ్రైవింగ్ వంటి పనులను కూడా చేసేయగలరు అనడానికి చిక్కబళ్లాపురం తాలూకా తిప్పేనహళ్లి గ్రామ పంచాయతీ చెత్త తరలింపు వాహనం డ్రైవర్ నందినినే నిదర్శనం. ఆమె భర్త అనారోగ్యంతో 2 సంవత్సరాల కిందట మరణించాడు. ఇద్దరు పిల్లలు, కుటుంబ పోషణ కోసం ఆలోచించిన నందిని భర్త చేసే డ్రైవింగ్‌నే ఎంచుకుంది. ఓ స్వసహాయ సంఘం సాయంతో డ్రైవింగ్‌ను నేర్చుకొని లైసెన్స్ పొందింది. పంచాయతీ స్వచ్ఛవాహిని డ్రైవర్ సమర్థంగా పనిచేస్తోంది. ఆమెకు నెలకు రూ. 10 వేల వేతనం లభిస్తోంది. గ్రామపంచాయతీ వ్యాప్తిలోని ప్రతి పల్లెకు వాహనంలో వెళ్లి చెత్త సంగ్రహణ చేస్తుంది. గత 6 నెలల నుంచి ఉద్యోగం చేస్తోంది. ఈ సందర్భంగా పంచాయతీ అధ్యక్షురాలు శశి.. నందినిని ఘనంగ సత్కరించారు.
అమ్మవారికి గంధ శోభ
బొమ్మనహళ్లి: బెంగళూరు బొమ్మనహళ్ళి నియోజకవర్గం హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ పరంగిపాళ్యలో గ్రామ దేవత మారమ్మదేవికి శనివారం సిరిగంధం లేపనంతో అలంకరించి పూజలు చేశారు. ఉదయమే అమ్మవారికి అభిషేకం, అలంకారం నిర్వహించి భక్తులకు దర్శనాలను కల్పించారు.
అన్నదాతలకు సున్నా బడ్జెట్
అన్నదాతలకు సున్నా బడ్జెట్
Comments
Please login to add a commentAdd a comment