ఉత్సవాలకు అంకురార్పణ
బొమ్మనహళ్లి: బొమ్మనహళ్ళి నియోజకవర్గం హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ అగరలో ప్రసిద్ధ శ్రీనివాసస్వామి ఆలయం బ్రహ్మ రథోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఈ నెల 14వ తేదీన రథోత్సవం జరుగుతుంది. ఆదివారం ధ్వజారోహణ, యాగశాలలో అగ్ని ప్రతిష్టాపన గావించారు. మూల విరాట్‌తో పాటు ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణ చేశారు.
రేపు వర్షసూచన
బనశంకరి: మార్చి 11 నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 11–12 తేదీల్లో కరావళి జిల్లాలు, దక్షిణ కర్ణాటకలో వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణశాఖ శాస్త్రవేత్త సీఎస్ పాటిల్ తెలిపారు. బంగాళాఖాతంలో మార్పుల వల్ల బెంగళూరు, మైసూరు, కోలారు, చిక్కబళ్లాపుర, రామనగర, హాసన్, చిక్కమగళూరు, మండ్య, శివమొగ్గ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో 11 –12 తేదీల్లో వర్షాలు రావచ్చని తెలిపారు. అయితే ఉత్తర కర్ణాటక జిల్లాల్లో ఎండలు తీవ్రరూపం దాలుస్తాయని పేర్కొన్నారు.
హంపీ దురాగతం..
మరొకరు అరెస్టు
సాక్షి, బళ్లారి/ యశవంతపుర: హంపీ తుంగభద్ర నదీ తీరాన కొప్పళ జిల్లా గంగావతి సమీపంలోని సణాపురం వద్ద ఇజ్రాయెల్ మహిళ, స్థానిక మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ఒక పర్యాటకున్ని కాలువలోకి తోసి హత్య చేసిన కేసులో మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సాయిరామ్‌ను ఆదివారం తమిళనాడులో అరెస్ట్ చేసి తరలించారు. ఈ ఘటనపై హోంమంత్రి జీ పరమేశ్ బెంగళూరు మాట్లాడుతూ మల్లేశ్, చేతన్, సాయిరామ్ అనే వారు అరెస్టయ్యారని, మరో నిందితుని కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment