దుష్ట సంస్కృతిపై మహిళలు గళమెత్తాలి
రాయచూరు రూరల్: సమాజంలో నెలకొన్న వరకట్నం, భ్రూణహత్యలు తదితర దుష్ట సంస్కృతిని అంతమొందించేందుకు మహిళలు ముందడుగు వేయాలని ప్రజాపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం సంచాలకురాలు స్మిత పిలుపు ఇచ్చారు. ఆ విశ్వ విద్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిహిళా దినోత్సవంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారని, అంతరిక్ష యాత్రలు కూడా చేపట్టి ఆకాశంలో కూడా విజయకేతనం ఎగురవేస్తున్నారని కొనియాడారు. దానమ్మ, సురేఖ, లతా, డాక్టర్ వసుంధర పాటిల్ ,మంజుల, గోపాల్, చంద్రశేఖర్, మంజునాథ్, సుజాత, మేటిగౌడ, వీరహనుమాన్, రేఖ, మారుతీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment