జన్మదిన వేడుకల్లో విషాదం
హొసపేటె: జన్మదిన వేడుకల సందర్భంగా ఆలయానికి వెళ్లిన స్నేహితులు నదిలో ఈత కొట్టేందుకు దిగారు. వారిలో ముగ్గురు గల్లంతయ్యారు. ఈఘటన గదగ్ జిల్లా ముండరిగి తాలూకాలోని కోరలహళ్లి వంతెన సమీపంలో ఆదివారం జరిగింది. గదగ్ జిల్లా శిరహట్టికి చెందిన ఐదుగురు స్నేహితుల్లో ఒకరి జన్మదిన సందర్భంగా మాదలగట్టి ఆంజనేయుడి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం ఈత కొట్టేందుకు తుంగభద్ర నదిలోకి దిగారు. ఈత కొట్టే సమయంలో శరణప్ప బడిగేర్ (34) నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతుండగా కాపాడేందుకు వెళ్లిన స్నేహితులు మహేష్ బడిగేర్ (36), గురునాథ్ బడిగేర్ (38) కూడా గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం విజయనగర జిల్లా హువినహడగలి పోలీసులు స్థానిక మత్స్యకారుల సహకారంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.
తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి
ముగ్గురు గల్లంతు
జన్మదిన వేడుకల్లో విషాదం
జన్మదిన వేడుకల్లో విషాదం
Comments
Please login to add a commentAdd a comment