కుడి కాలువకు ఏప్రిల్ వరకు నీరందించండి
రాయచూరు రూరల్: నారాయణపుర కుడి కాలువ ఆయకట్టు చివరి భూములకు ఏప్రిల్ నెలాఖరు వరకు నీరందివ్వాలని కర్ణాటక రైతు సంఘం జిల్లాధ్యక్షుడు శివపుత్రప్ప పాటిల్ డిమాండ్ చేశారు. సోమవారం లింగసూగూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ట్రాక్టర్లు, కొవ్వొత్తులతో చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. కాలువకు మార్చి 31 వరకు నీరు వదలడానికి అధికారులు తీసుకున్న నిర్ణయంతో చేతికొచ్చిన పంట నోటికి అందకుండా పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. నీటి గేజ్ నిర్వహణ, సామర్థ్యాన్ని బట్టి ఆయకట్టు భూములకు నీరందేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చివరి భూములకు నీరు అందించడానికి శాశ్వత పరిష్కారం కనుగొనాలన్నారు. అనంతరం అధికారికి వినతిపత్రం సమర్పించారు.
కుడి కాలువకు ఏప్రిల్ వరకు నీరందించండి
Comments
Please login to add a commentAdd a comment