బంగారు నగల అప్పగింత
● ఆటోడ్రైవర్ నిజాయతీ
తుమకూరు: సుమారు 4 లక్షల రూపాయల విలువైన బంగారం నగలను ఓ మహిళ ఆటోలో మరిచిపోయి దిగిపోయింది. ఆటోడ్రైవర్ నిజాయతీతో ఆ మహిళకు తిరిగి అప్పగించాడు. తుమకూరు నగరంలోని హనుమంతపురకు చెందిన రవికుమార్ అనే ఆటోడ్రైవర్ మంచితనాన్ని అందరూ అభినందించారు. వివరాలు.. హాసన్ జిల్లా అరసికెరెకు చెందిన గాయత్రి అనే మహిళ ఓ బంధువుల ఇంట్లో వేడుక కోసం వచ్చింది. మళ్లీ బస్టాండుకు వెళ్లేందుకు నగరంలో ముగ్గురితో కలిసి రవికుమార్ ఆటోలో వచ్చింది. నగలు ఉన్న బ్యాగును ఆటోలో మరిచిపోయి బస్టాండులోకి వెళ్లింది. రవికుమార్ కొంతదూరం వెళ్లాక చూసుకుంటే బ్యాగు కనిపించింది. తిరిగి బస్టాండు వద్దకు వచ్చాడు, ఇంతలో మహిళ నగలు బ్యాగు లేదని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి బయల్దేరింది. ఆటోడ్రైవర్ నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ మహిళ ఉండడంతో నగల బ్యాగును అప్పగించడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. నగల విలువు రూ.4 లక్షలని చెబుతూ ధన్యవాదాలు తెలిపింది.
చక్కెర లారీ పల్టీ, ఇద్దరు మృతి
యశవంతపుర: బెళగావి జిల్లా రామదుర్గ తాలూకా హళగుత్తి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. చక్కెర లోడు లారీ పల్టీ కొట్టి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సోమవారం ఉదయం బెళగావి నుంచి రామదుర్గ తాలూకాకు చక్కెర లోడ్ చేసుకొని వెళుతున్న లారీ వేగంగా వెళ్తూ అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బాలప్ప ముదకవి (28), యల్లప్ప చెన్ననవర్ (35) అనే హమాలీ కార్మికులు అక్కడికక్కడే మరణించారు. లారీ డ్రైవర్‌తో పాటు మరో కూలీకి తీవ్ర గాయాలై రామదుర్గ ప్రభుత్వ అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రామదుర్గ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు. చక్కెర మూటల మధ్యలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు.
ఆర్టీసీ బస్సు బోల్తా
యశవంతపుర: బ్రేక్ ఫెయిలై కేఎస్ ఆర్టీసీ బస్సు పల్టీ పడిన ఘటన బెళగావి జిల్లా బైలహొంగల తాలూకా లింగదహళ్లి అరవళ్లి గ్రామం వద్ద సోమవారం జరిగింది. బస్సు వేగంగా వెళ్తున్న సమయంలో బ్రేకులు పడలేదు, అదుపు తప్పి రోడ్డు పక్కకు పల్టీలు కొట్టింది. 10 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బైలహొంగల పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి క్రేన్ ద్వారా బస్సును యథాస్థానంలో ఉంచారు.
ఆటోడ్రైవర్.. ఆఫీసర్ చైర్
యశవంతపుర: అతడో పెద్ద అధికారి, లేదా ఉద్యోగి కావాలనుకున్నాడు. కానీ విధి ఆటలో ఆటోడ్రైవర్‌గా మిగిలిపోయాడు. అయినా అతనిలోని కోరిక ఊరికే ఉండనివ్వలేదు. ఆటోలో పెద్ద చైర్‌ను అమర్చుకుని నడుపుతున్నాడు. బెంగళూరు ఆటో డ్రైవర్ ఒకరు తన సీటు స్థానంలో ఆఫీసు చైర్‌ను ఉపయోగించటం చూపరులను అబ్బురపరుస్తోంది ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. నెటిజన్లు ఆటో డ్రైవర్ స్ఫూర్తిని అభినందిస్తూ సందేశాలు పెట్టారు. కుర్చోవడానికి సులభంగా ఉందని అన్నారు.
నిశ్చితార్థానికి వెళ్లి వస్తుండగా..
మైసూరు: నిశ్చితార్థానికి వెళ్లి వస్తున్న బస్సు బోల్తా పడగా డ్రైవర్ మృతి చెందగా, 35 మంది గాయపడ్డారు. చామరాజనగర జిల్లా హనూరు తాలూకా తెళ్ళనూరు– బండళ్ళి మార్గంలో జరిగింది. శాగ్య గ్రామానికి చెందిన యువకునికి కనకపుర సమీపంలో ఉన్న హనియూరుకు చెందిన యువతితో నిశ్చితార్థం జరిగింది. 70 మంది ఓ ప్రైవేటు బస్సును మాట్లాడుకుని వెళ్లారు. స్థానికుడు ప్రవీణ్ (32) డ్రైవర్‌గా వెళ్లాడు. వేడుక చేసుకుని సంబరంగా తిరిగి వస్తున్నారు. వేగంలో వెళ్తున్న బస్సు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. బస్సు ఫుట్‌బోర్డులో నిలబడి ఉన్న చాలా మంది కింద పడిపోయారు. డ్రైవర్ ప్రవీణ్ తీవ్ర గాయాలతో అక్కడే చనిపోయాడు. సునీల్ అనే వ్యక్తికి రెండు కాళ్లు నుజ్జయ్యాయి. బండహళ్ళి గ్రామస్తులు వచ్చి అందరినీ బయటకు తీశారు. హనూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
బంగారు నగల అప్పగింత
బంగారు నగల అప్పగింత
Comments
Please login to add a commentAdd a comment