డబ్బు కోసం గొడవ.. యువకుడికి గాయం
కోలారు: డబ్బు విషయంలో జరిగిన గొడవలో యువకుడిపై చాకుతో దాడి చేసి తీవ్రంగా గాయపరచిన ఘటన ఆదివారం రాత్రి నగరంలోని శారదా టాకీస్ వద్ద చోటు చేసుకుంది. భోవి నగర నివాసి సునీల్‌కుమార్ దాడిలో గాయపడిన యువకుడు. నగరానికి చెందిన రాహుల్, కృష్ణోజీరావ్‌లకు సునీల్ అనే వ్యక్తితో ఆర్థిక లేవాదేవీలు ఉండేవి. ఈ నేపథ్యంలో వీరి మధ్య ఆదివారం రాత్రి గొడవ ప్రారంభమైంది. ఆవేశానికి లోనైన రాహుల్, కృష్ణోజీరావ్‌లు సునీల్‌పై చాకుతో దాడికి దిగారు. ఈ సమయంలో సునీల్ కాలికి తీవ్ర గాయం కావడంతో అతనిని స్థానికులు ఎస్‌ఎన్‌ఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. రాహుల్ పరారీలో ఉండగా దాడిలో కృష్ణోజీరావ్‌కు కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. కోలారు నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment