దేవ దేవం.. ఘన రథోత్సవం
మైసూరు: ఇది రథోత్సవాల సమయం కావడంతో రాష్ట్రంలో ప్రధాన పుణ్యక్షేత్రాల్లో తేరు వేడుకలు రమణీయంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా భక్త కోలాహలంతో ఆధ్యాత్మిక సంబరం మిన్నంటింది. మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకాలో ఉన్న బిళికెరె దగ్గర చరిత్ర ప్రసిద్ధ గద్దిగ కండగణ్ణేశ్వర స్వామి, మహాదేశ్వర స్వామి వారి జంట రథోత్సవం సోమవారం వేలాది మంది భక్తుల మధ్య సాగింది. ఆదిచుంచనగి సాంబసదాశివ స్వామి పాల్గొని పూజలు చేసి వేడుకలకు నాంది పలికారు. పెద్ద తేరు మీద కండగణ్నేశ్వర స్వామివారు, చిన్న తేరులో మహాదేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను ఆసీనులను చేశారు. ఈ సందర్భంగా నిప్పుల కొలిమిలో భక్తులు నడిచారు. అలాగే చిక్కమగళూరు సమీపంలోని హిరేమగళూరులో కోదండ రామచంద్రస్వామి ఆలయ తేరు ఉత్సవం ఘనంగా జరిగింది. మైసూరు క్యాతమారనహళ్లిలో హులియమ్మ జాతర, బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా కెరూరులో అరణ్య సిద్ధేశ్వర జాతర ఉత్సవం వైభవంగా జరిగాయి.
చెన్నబసవేశ్వర రథోత్సవం
తుమకూరు: జిల్లాలోని గుబ్బి పట్టణంలో ఉన్న చరిత్ర ప్రసిద్ధ గోసల చన్నబసవేశ్వర స్వామి జాతర మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. బ్రహ్మ రథోత్సవానికి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. మూల విరాట్‌తో పాటు ఉత్సవమూర్తులకు పూజలు చేసి రథంలో ప్రతిష్టించి తేరును లాగారు.
మైసూరు సహా పలు జిల్లాల్లో తేరు ఉత్సవాల సందడి
దేవ దేవం.. ఘన రథోత్సవం
దేవ దేవం.. ఘన రథోత్సవం
Comments
Please login to add a commentAdd a comment