ఏపీఎంసీ, సబ్‌జైలులో ఉప లోకాయుక్త తనిఖీ
కోలారు: కర్ణాటక రాష్ట్ర ఉపలోకాయుక్త బీ.వీరప్ప సోమవారం నగరంలోని సబ్ జైలు, ఏపీఎంసీ మార్కెట్ యార్డును తనిఖీ చేశారు. అక్కడి అవ్యవస్థలను చూసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీఎంసీ మార్కెట్ యార్డులో రైతులకు తాగునీటి వ్యవస్థ లేదు. చెత్తా చెదారం పేరుకు పోయింది. మార్కెట్‌లో కమీషన్ అధికంగా వసూలు చేస్తున్నారు. లోపల ఏం జరుగుతోందో అధికారులకు తెలియని పరిస్థితి నెలకొంది. స్వయం ప్రేరిత ఫిర్యాదు దాఖలు చేసుకుంటానన్నారు. సబ్ జైలును సందర్శించినప్పుడు సబ్ జైలు వసతి నిలయాల మధ్య ఉండడాన్ని చూసి సబ్‌జైలును నగరానికి దూరంగా తరలించాలని జైలు అధికారులకు సూచించారు. మార్కెట్, సబ్ జైలులో అపరిశుభ్ర వాతావరణ ఉండడంపై మండిపడ్డారు. సిబ్బంది కొరత ఉందని అధికారులు సాకులు చెప్పడంతో సిబ్బంది కొరత ఉందని మీరు భోజనం చేయకుండా మానేస్తున్నారా? అని ప్రశ్నించారు. కోలారు నగరసభ కమీషనర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment