బెళగావిలో కన్నడ సంఘాల ధర్నా
శివాజీనగర: బెళగావిలో సోమవారం కన్నడ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మహారాష్ట్ర ఏకీకరణ సమితి(ఎంఈఎస్)ని నిషేధించాలని, మరాఠాలను పారదోలాలని పలు డిమాండ్లతో కన్నడ ఒక్కూట అధ్యక్షుడు వాటాళ్ నాగరాజ్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. బెళగావిలోని రాణి చెన్నమ్మ సర్కిల్‌లో బైఠాయించి ఎంఈఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బస్సు కండక్టర్‌పై దాడి చేయడం హేయమని ధ్వజమెత్తారు. ఎంఈఎస్ కన్నడిగులపై దాడి చేస్తూ సామరస్యతకు భంగం కలిగిస్తోందన్నారు. బెళగావిలో ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదని ఆరోపించారు. సా.రా.గోవిందు, ఎల్.ఆర్.శివరామేగౌడ, రూపేశ రాజణ్ణ తదితరులు పాల్గొన్నారు.
మాంగళ్య మహోత్సవం
మండ్య: మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని ఆదిచుంనగిరి మఠంలో సోమవారం సామూహిక వివాహ వేడుకలను నిర్వహించారు. 10 నూతన జంటలకు పెళ్లి చేశారు. అలాగే 50 సంవత్సరాలుగా దాంపత్య జీవితంలో ఉన్న సుమారు 260 వృద్ధ జంటలకు ఘనంగా సన్మానించారు. ఉదయం నుంచి వివిధ హోమాలు, పూజలు, నిర్వహించారు. మఠాధిపతి నిర్మలానందనాథ స్వామీజీ, ఇతర స్వాములు పాల్గొని దంపతులను ఆశీర్వదించారు.
గ్రేటర్ పరిధిలోకి
పోలీసు శాఖ
● బిల్లు చర్చలో డిప్యూటీ సీఎం
శివాజీనగర: కాంగ్రెస్ సర్కారు ఎంతో ప్రతిష్టగా భావిస్తున్న గ్రేటర్ బెంగళూరు బిల్లును డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోమవారం విధానసభలో ప్రవేశపెట్టారు. ఒక్కటిగా ఉన్న బెంగళూరు కార్పొరేషన్‌ను ప్రభుత్వం పాలనా సౌలభ్యం పేరుతో 7 పాలికెలుగా చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. నగర పరిధిలోని పోలీసులను గ్రేటర్ బెంగళూరు పరిపాలన కిందకు తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి గ్రేటర్ బెంగళూరు ప్రాధికార అధ్యక్షునిగా ఉంటారు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఉపాధ్యక్షునిగా ఉంటారని చెప్పారు. పన్ను అంశాలను ప్రస్తావించారు. బీడీఏ అధ్యక్షుడు సభ్యునిగా ఉంటారు, సభ్యులు, అధికారులకు ఎక్కువ అధికారం ఇస్తామన్నారు. మౌలిక సదుపాయాల నిర్వహణ సహా పలు అంశాలపై మొత్తం 6 కమిటీలు ఉంటాయి. ఒక్కో పాలికె కనీసం 10 లక్షల కంటే అధిక జనసంఖ్య ఉండాలి. పాలికెల విభజనలో ఆదాయాన్ని సైతం పరిగణిస్తారు. బీబీఎంపీ సెంట్రల్, దక్షిణ, ఉత్తర ఇలా బెంగళూరు పేరే ఆ పాలికెలకు ఉంటుంది. ఏ ప్రైవేట్ వ్యక్తి పేరును ఉండదు అని తెలిపారు.
బెళగావిలో కన్నడ సంఘాల ధర్నా
Comments
Please login to add a commentAdd a comment