
స్నేహ హస్తం అందిస్తే ప్రాణం తీసింది
మైసూరు : కష్టాల్లో తనను గట్కెక్కించందనే కృతజ్ఞత కూడా లేకుండా ఓ మహిళ బంగారం కోసం కుక్కర్తి పడి స్నేహితురాలిని అంతమొందించింది. ఈ ఘటన మైసూరులో జరిగింది. నగరంలోని కేసీ లేఔట్‌లో విశ్రాంత పోలీసు ఉద్యోగి గంగణ్ణ, సులోచన(62) దంపులు నివాసం ఉంటున్నారు. వీరి ఇంటిపక్కనే శకుంతల అనే మహిళ నివాసం ఉంటోంది. పక్కపక్క ఇళ్లు కావడంతో సులోచన, శకుంతల స్నేహంగా ఉండేవారు. శకుంతల అప్పుల్లో కూరుకుపోవడంతో సులోచన 45 గ్రాముల బంగారం చైన్ ఇచ్చింది. దానిని కుదువ పెట్టి అప్పులు తీర్చుకో అని చెప్పింది. ఇలా పలు పర్యాయాలు చైన్ ఇవ్వడం, తిరిగి ఇవ్వడం జరిగింది. అయితే సులోచన వంటిపై ఉన్న బంగారు నగలపై శకుంతల కన్నేసింది. ఇంటికి పిలిచి బెడ్‌రూంలోకి తీసుకెళ్లి ముఖంపై దిండు అదిమి పెట్టి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసింది. ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచుకొని కుదువ పెట్టి రూ.1.50లక్షలు తెచ్చుకుంది. సులోచన కుమారుడు రవిచంద్రకు ఫోన్ చేసి మీ అమ్మ కుప్పకూలిందని చెప్పింది. కుమారుడు వచ్చి సులోచనను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే తన తల్లి మృతిపై అనుమానం ఉందని నజరాబాద్ పోలీసులకు కుమారుడు ఫిర్యాదు చేశాడు. తన తల్లికి, శకుంతలకు మధ్య ఆర్థిక వ్యవహారాలు నడిచినట్లు చెప్పడంతో పోలీసులు శకుంతలను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేపట్టాగా వాస్తవాన్ని వెల్లడించింది. దీంతో పోలీసులు శకుంతలను అరెస్ట్ చేశారు. కుదువ పెట్టిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బంగారం కోసం మహిళ ప్రాణం తీసిన స్నేహితురాలు
Comments
Please login to add a commentAdd a comment