తుమకూరు జిల్లాలో హనీట్రాప్
తుమకూరు: జిల్లాలో హనీ ట్రాప్ ఆరోపణలు గుప్పుమన్నాయి. గుబ్బి పట్టణ పంచాయతీ మాజీ అధ్యక్షుడు జీఎన్ అన్నప్పస్వామి ఈ మేరకు ఓ యువతిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారం జిల్లా అంతటా చర్చనీయాంశమైంది. ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం అన్నప్పస్వామికి ఇటీవల ఫేస్‌బుక్‌లో నిషా అనే యువతి పరిచయమైంది. దీంతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగి తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అమ్మాయి ఆహ్వానం మేరకు హాసన్, తిపటూరు, దొడ్డబళ్ళాపుర, నెలమంగల ఇలా అనేకచోట్ల కలిశారు. ఆపై యువతి నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్ళి చేసుకోవాలని ఒత్తిడి చేయసాగింది. దీనికి తిరస్కరించడంతో నిషా, ఆమె స్నేహితులతో కలిసి బెదిరింపులకు పాల్పడింది. మనం కలిసి ఉన్న నగ్నచిత్రాలను వైరల్ చేస్తానని హెచ్చరించింది. తనను హనీ ట్రాప్ చేసి రూ. 20 లక్షల డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేస్తోందని అన్నప్పస్వామి చెబుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నారు.
పెళ్లి చేసుకోవాలని, డబ్బలు ఇవ్వాలని బెదిరిస్తోంది
ఓ యువతిపై చోటా నేత ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment