
గ్యారెంటీ కమిటీలు, సర్వేలు ఏమిటి?
శివాజీనగర: సర్కారు గ్యారెంటీ పథకాల అమలు కమిటీలను రద్దు చేయాలని రెండురోజుల నుంచి అసెంబ్లీ విధానసభలో గొడవ జరుగుతుండగా, గురువారం ఎగువసభలోనూ ఇదే చోటుచేసుకుంది. కమిటీల నియామకాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. అధికార పార్టీ సమర్థించుకుంది. జేడీఎస్ సభ్యులు గ్యారెంటీ పథకాల అమలు, వాటి మీద చేపట్టిన సమీక్ష గురించి ప్రశ్నలు వేశారు. మంత్రి ఎన్.ఎస్.బోసురాజు సమాధానమిస్తూ ముంబయికు చెందిన సంస్థలు, అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయానికి గ్యారంటీల సమీక్షను అప్పగించాం. ఎలాంటి నిధులు ఇవ్వలేదన్నారు. తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని జేడీఎస్ సభ్యులు అన్నారు. డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ జోక్యం చేసుకుని, గ్యారెంటీల సొమ్ము సక్రమంగా ప్రజలకు చేరుతోందా అని తెలుసుకోవడానికి సర్వేని కొన్ని ఏజెన్సీలకు అప్పగించాం. గ్యారెంటీ పథకాలకు రూ.52 వేల కోట్లు కేటాయించాం. సర్వేకి 1 శాతం ఖర్చు చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. కమిటీలకు జీతాలు ఇస్తున్నారని కొందరు ప్రస్తావించగా, డీకే మండిపడ్డారు. సర్వేల కోసం ఎంటీఎం సంస్థకు రూ. 1 కోటి, రైట్స్ పీపుల్ సంస్థకు రూ.9.25 కోట్లు ఇచ్చారు, దీనిని ఎందుకు దాచిపెట్టారని బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి ప్రశ్నించారు.
గొడవ వద్దు, చర్చించండి: సభాపతి
ప్రభుత్వ సొమ్మును కాంగ్రెస్ కార్యకర్తలకు ఎందుకు ఇస్తారు? గ్యారెంటీలు ప్రజలకు ఇవ్వండి అని ప్రతిపక్ష సభ్యుల అరిచారు. సభాపతి బసవరాజ హొరట్టి స్పందిస్తూ ఆందోళనలు వద్దు, చర్చ జరగాలి అని సూచించారు. అందరూ లేచి నిలబడి మాట్లాడితే ఎలాగని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా కూడా అధికార, ప్రతిపక్షాల మాటల యుద్ధం కొనసాగింది. డీకే మాట్లాడుతూ అమలు కమిటీలను రాజకీయంగా నియమించింది నిజమే అన్నారు. మరోవైపు విధానసభలో గ్యారెంటీ కమిటీలు, సర్వేతో సహా పలు అంశాలపై బీజేపీ ఎమ్మెల్యేలు సర్కారుపై విమర్శలు గుప్పించారు.
ఇది డల్ బడ్జెట్: అశోక్
వచ్చే ఏడాది మరింత భారీ బడ్జెట్‌ను సమర్పిస్తానని సీఎం సిద్ధరామయ్య విధానసభలో చెప్పారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బీజేపీ పక్ష నేత అశోక్ మాట్లాడుతూ అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తారా? అని 2017లో సిద్ధరామయ్య అనేవారు. ఇప్పుడు సిద్దు డల్‌గా తయారయ్యారు, ఆయన బడ్జెట్ కూడా అలాగే ఉంది. అప్పుల డబ్బును రాజకీయ అవసరాల కోసం పథకాలకు ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు.
సర్వేలకు కోట్లాది రూపాయలా?
ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఆగ్రహం
తప్పేం లేదన్న డిప్యూటీ సీఎం
ఈసారి ఎగువసభలో గందరగోళం
సీఎంకు కమీషన్ల నివేదిక
శివాజీనగర: కాంట్రాక్టర్ల 40 శాతం కమీషన్ ఆరోపణ కేసు విచారణ తాను ఎదుర్కొన్న పెద్ద సవాల్ అని హైకోర్టు విశ్రాంత జడ్జి హెచ్.ఎన్.నాగమోహన్‌దాస్ అన్నారు. సీఎం సిద్దరామయ్యకు 20 వేల పేజీల నివేదికను సమర్పించి విలేకరులతో మాట్లాడారు. గత సర్కారు హయాంలో కాంట్రాక్టర్ల నుంచి పనుల కేటాయింపులు, బిల్లలు మంజూరుకు పెద్ద మొత్తాల్లో కమీషన్లు వసూలు చేశారని ఆరోపణలు రావడంతో సిద్దరామయ్య సర్కారు విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అధికారులు, సిబ్బంది శ్రమతో, సుదీర్ఘంగా విచారణ జరిపి బాధ్యతలను నెరవేర్చానని నాగమోహనదాస్ తెలిపారు.
బెంగళూరు ప్యాలెస్ చట్టం ఓకే
బనశంకరి: బెంగళూరు ప్యాలెస్ మైదానం భూ కబ్జా, నియంత్రణ చట్టం అమలులోకి వచ్చింది. ప్రభుత్వం పంపిన బిల్లుకు గవర్నర్ గెహ్లాట్ ఆమోదించారు. ప్యాలెస్ మైదానం భూమిలో అభివృద్ధి పనులు చేయాలా, వద్దా అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ హక్కు. ఈ చట్టం ద్వారా ప్యాలెస్ మైదానం స్థలాన్ని రోడ్డు విస్తరణకు వాడుకునే హక్కు లభించింది. 15.39 ఎకరాల స్థలానికి, మరికొంత స్థలానికి కలిపి రూ.3,414 కోట్ల టీడీఆర్ మొత్తాన్ని మైసూరు రాజ కుటుంబానికి అందించాలి. కానీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు జమ చేసినట్లు తెలిసింది. కొత్త చట్టం ద్వారా ప్యాలెస్ భూమిపై రాజకుటుంబానికి కూడా నియంత్రణ తగ్గుతుంది.

గ్యారెంటీ కమిటీలు, సర్వేలు ఏమిటి?

గ్యారెంటీ కమిటీలు, సర్వేలు ఏమిటి?

గ్యారెంటీ కమిటీలు, సర్వేలు ఏమిటి?
Comments
Please login to add a commentAdd a comment