స్మగ్లింగ్ ఇదే మొదటిసారి!
బనశంకరి: బంగారం తీసుకు రావడం ఇదే మొదటిసారి.. అని విదేశాల నుంచి బంగారం స్మగ్లింగ్ కేసులో పట్టుబడిన రన్య రావు డీఆర్‌ఐ అధికారుల విచారణలో చెప్పింది. మార్చి 1వ తేదీన నాకు విదేశీ ఫోన్ నంబరు నుంచి కాల్ వచ్చింది. రెండు వారాలుగా గుర్తుతెలియని విదేశీ నంబర్ల నుంచి అనేక కాల్స్ వస్తున్నాయి. దుబాయ్ విమానాశ్రయం టెర్మినల్ మూడోగేట్–ఏ కు వెళ్లాలని సూచించారు. అక్కడ బంగారం తీసుకుని బెంగళూరుకు తీసుకెళ్లాని చెప్పారు. మార్చి 3వ తేదీన దుబాయ్‌లో తెల్లని దుస్తులు ధరించిన వ్యక్తి 17 బంగారు బిస్కెట్లు ఉన్న బాక్సు ఇచ్చాడు. బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయం నుంచి బయటికి వెళ్లిన తరువాత టోల్‌గేటు దాటి సర్వీస్ రోడ్డులో ఆటో నిలిచి ఉంటుంది. అందులో ఉండే వ్యక్తికి బంగారం ఇవ్వాలని చెప్పారని ఆమె తెలిపింది. తరువాత టాయ్‌లెట్‌లోకి వెళ్లి శరీరమంతా బంగారు బిస్కెట్లు అంటించుకుని టేప్‌తో అతికించుకున్నాను. బెంగళూరుకు చేరుకోగానే పట్టుబడ్డానని తెలిపింది. బంగారాన్ని ఎలా తరలించాలో యూట్యూబ్ వీడియోలు చూసి నేర్చుకున్నానని పేర్కొంది.
భర్త క్రెడిట్ కార్డుతో టికెట్లు
ఫోన్ చేసిన వ్యక్తులు ఆఫ్రికన్, అమెరికన్ భాషల్లో మాట్లాడారని రన్య చెప్పింది. తన భర్త జతిన్ విజయ్‌కుమార్ క్రెడిట్‌కార్డు ద్వారా విమాన టికెట్లు బుక్ చేశానని రన్య చెబుతోంది. ఫోటోగ్రఫీ, రియల్‌ఎస్టేట్ పనులపై నేను అప్పుడప్పుడు యూరప్, అమెరికా, ఆఫ్రికా, పశ్చిమ ఆసియా దేశాలకు వెళ్లానని తెలిపింది. రన్య చెప్పేది నమ్మశక్యంగా లేదని డీఆర్‌ఐ అనుమానిస్తోంది. ఆమె మొబైల్, ల్యాప్‌టాప్‌లో స్మగ్లింగ్ సంబంధాలు లభించాయని సమాచారం. మరోవైపు తనపై మీడియాలో వ్యతిరేక వార్తలు రాయకుండా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టులో అర్జీ వేశారు.
దుబాయ్‌లో ఎవరో ఇచ్చి,
బెంగళూరులో ఇవ్వమన్నారు
విచారణలో నటి రన్య రావు
Comments
Please login to add a commentAdd a comment